రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎంపి నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంతో రఘురామ కృష్ణంరాజు కుమ్మక్కై.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని.. అతని భాష వింటే ఎంపి అని చెప్పటం కూడా సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాజద్రోహానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని నిప్పులు చెరిగారు.
రఘురామ వెనుక కథ, కర్మ, కర్త, క్రియ అంతా చంద్రబాబే అని.. తానే ఇదంతా చేయించిన విషయాన్ని రఘురామ కృష్ణంరాజు బయటపెట్టేస్తాడేమో అన్న భయం చంద్రబాబులో కనిపిస్తోందని ఆరోపించారు. రఘురామ కృష్ణంరాజు మహా నటుడు అని.. కొన్ని మీడియా సంస్థల అండతో నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ఫైర్ అయ్యారు. రఘురామ కృష్ణంరాజును కొట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని..లోక్ సభ స్పీకర్ కు రఘురామ కృష్ణంరాజుపై ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.