తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,20,709 కి చేరింది. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కరోనా బాధితులను అదుకునేందుకు “ఆపదలో తోడుగా YSSR”అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. “తెలంగాణ ఆడబిడ్డలారా.. ధైర్యం […]
టిడిపి అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. దేశంలోని కీలక రాజకీయ నేతల కుమారులు రాజకీయాల్లో బాగా రాణిస్తుంటే.. లోకేష్ మాత్రం తుక్కైపోయాడని కౌంటర్ వేశారు. “వైస్సార్ కుమారుడు రికార్డ్స్ సృష్టించారు. స్టాలిన్ కుమారుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడు. కేసీయార్ కుమారుడు గెలిచాడు. ములాయం కుమారుడు గెలిచాడు. థాక్రే కుమారుడు గెలిచాడు. 40ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు మాత్రం తుక్కైపోయాడు – స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్ అని బిల్డప్ ఇస్తాడు. […]
ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. దేశంలో ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ అంటూ లోకేష్ పేర్కొన్నారు. ” నియంత కంటే ఘోరంగా ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా, తన కక్ష తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న దేశంలో ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారని..వై కేటగిరి భద్రతలో వుంటూ ఇటీవలే […]
ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 3,26,098 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,43,72,907 కి చేరింది. ఇందులో 2,04,32,898 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,73,802 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24గంటల్లో ఇండియాలో కరోనాతో 3,890 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,66,207 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, […]
ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేయడంపై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ మానవత్వం లేకుండా వ్యవహరించిందని ఆమె మండిపడ్డారు. “వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేసి ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ పాలకుల తీరును అన్ని వర్గాలూ తప్పుబడుతున్నా ఈ సర్కారు స్పందించడం లేదు. ఆస్పత్రులలో బెడ్స్ కన్ఫర్మ్ చేసుకుని, అందుకు రుజువులు […]
ఇండియాలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశంలో ముంపు దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూరుకు 360 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగాల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడి ఈ నెల 16న తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫానుగా మారితే దీన్ని ‘తౌక్టే’ అని పిలుస్తారు. ‘తౌక్టే’ తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది.. గుజరాత్ వద్ద […]
ఆక్సిజన్ సంక్షోభం అంచున తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఉంది. ఆసుపత్రికి పంపే ఆక్సిజన్ లో కోత విధించాల్సిందిగా సరఫరాదారును ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్ వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్ కి ఆక్సిజన్ వస్తుండగా.. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం 8కేఎల్ కి మించి ఆక్సిజన్ పంపించలేమని స్విమ్స్ కి తేల్చి చెప్పారు గుత్తేదారు. ప్రస్తుతం స్విమ్స్ లో 467మంది కోవిడ్ రోగులు […]
తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ని రేపు, ఎల్లుండి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కొవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు 12 నుంచి 16 వారాల వ్యవధిలో ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం […]
సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి. వినియోగదారులు బంగారంపై పెట్టుబడులు పెడితే సేఫ్ అనే ఉద్దేశ్యంతో వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరిగాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ప్రధాని స్పష్టం చేయడంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల […]
మేషం : మీకు పన్నునొప్పికానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సత్వర బాధా నివృత్తికోసం ఒక డాక్టరును సంప్రదించండి. ఈరోజు,మీబంధువులలో ఎవరైతే మీదగ్గర అప్పుతీసుకుని తిరిగి చెల్లించకుండా మల్లిఅడుగుతారో వారికి అప్పుఇవ్వకండి. ఆఫీసులో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే, ఇంట్లో జీవితం బాదపడుతుంది. మీరు మీప్రియమైనవారితో బయటకువెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణపట్ల జాగ్రత్త వహించండి,లేనిచో మీప్రియమైనవారి కోపానికి గురిఅవుతారు. ఒంటరిగా సమయము గడపటంమంచిది. వృషభం : మీకోసం […]