చైనాలో పుట్టిన కరోనా వైరస్ విజృంభణ ఇండియాలోనూ కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. తాజాగా దేశంలో 3,11,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077 కి చేరింది. ఇందులో 2,07,95,335 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,18,458
కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,077 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటివరకు కరోనాతో 2,70,284 మంది మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 3,62,437 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. ఇకపోతే ఇప్పటి వరకు ఇండియాలో 18,22,20,164 మందికి వ్యాక్సిన్ అందించారు.