ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఎంపీ లనే చంద్రబాబు బిజెపిలోకి పంపించాడని.. వైసీపీ ఎంపీని లోబర్చుకుని తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయిస్తాడని నిప్పులు చెరిగారు. “సొంత పార్టీ ఎంపీలు నలుగురిని స్వయంగా తనే బిజెపిలోకి పం పించాడు. దానిపై ఒక్క మాట మాట్లాడలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీని లోబర్చుకుని తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయిస్తాడు. ప్రభుత్వంపై కేసులు వేయిస్తాడు. దీన్ని రాజకీయం అంటారా బ్రోకరిజం అంటారా చంద్రబాబూ? రాష్ట్రంలో కోవిడ్ మరణాల పాపం చంద్రబాబుకు తప్పక చుట్టుకుంటుంది. ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ కార్పోరేట్ హాస్పిటళ్లకు మళ్లించాడు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ మౌలిక వసతుల కొరత వల్లే రోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.” అంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.