ఫీచర్ ఫోన్లలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే… డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం త్వరలో రాబోతోంది. ఈ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో యూపీఐ ఆధారిత ఉత్పత్తులను ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు. చిన్న మొత్తాల లావాదేవీల ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు ఆర్బీఐ గవర్నర్. ఇది ఇలా ఉండగా… కీలక వడ్డీ రేట్లు రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే […]
భారత్ ఓ నికార్సైన దేశభక్తుణ్ని కోల్పోయింది. దేశం కోసం నాలుగు దశాబ్దాలకు పైగా అనేక పోరాటాలు చేసిన వీరుణ్ని పోగొట్టుకుంది. చివరి రోజు వరకు విధినిర్వహణలోనే గడిపిన జనరల్ బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు అసామాన్యం. 1978లో మొదలైన ఆయన కెరీర్ నేటివరకు అంచెలంచెలుగా ఎదగటంలో అకుంఠిత దీక్ష, అంతులేని క్రమశిక్షణ ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. 2019 డిసెంబర్ 30నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు.భారత్‌కు తొలి […]
సింగరేణిలో సుదీర్ఘకాలం తరువాత సమ్మె సైరన్ మోగింది.నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనలకు దిగారు. మరో 11 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి.18 ఏళ్ల తర్వాత అన్ని కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికి కాకుండా […]
ఢిల్లీః తమిళ నాడు లో నిన్న జరిగిన హెలి కాప్టర్ ప్రమాదంలో… 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించడం విషాదకరం. ఇది ఇలా ఉండగా… శుక్రవారం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే… రేపు సాయంత్రం ఆర్మీ విమానంలో ఢిల్లీకి పార్థివదేహాలను తరలించనున్నారు. శుక్రవారం ఢిల్లీలోని […]
మన ఇండియా బంగారం ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా నమోదైన బంగారం ధరలు.. అయితే.. ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 190 పెరిగి రూ. 44,950 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 210 పెరిగి రూ. 49, 040 కి చేరింది. ఇక అటు వెండి ధరలు మాత్రం […]
మేషం :- కొబ్బరి, పండు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. అవివాహితులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధు మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ కుమారుని మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. వృషభం :- మీ ఉన్నతిని చాటుకోడటం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారి నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. […]
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యోగ సంఘాలు చురుకుగా పనిచేశాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా అంతే యాక్టివ్‌గా ఉన్నాయి. కానీ.. ఆ రెండు సంఘాలకే ప్రాధాన్యం ఇవ్వడంపై.. మిగతావాళ్లు కత్తులు నూరుతున్నారట. ఉద్యమంలో పాల్గొన్నవారిపై ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తున్నారు. రెండు ఉద్యోగ సంఘాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా? ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్నలా తమ పరిస్థితి మారిందని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొన్ని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. రాష్ట్రంలో […]
తెలంగాణలో ఇతర పార్టీ నేతలను ఆకర్షించే విషయంలో బీజేపీ ప్లాన్ మారిందా? ఇందుకోసం ఇద్దరు నాయకులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారా? బీజేపీని వీడి వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి తీసుకొస్తారా? కాషాయ శిబిరం వ్యూహం ఏంటి? రెండో దశ చేరికలకు బీజేపీ తలుపులు తెరిచిందా? బీజేపీలో చేరికలపై తెలంగాణలో మళ్లీ చర్చ మొదలైంది. అప్పట్లో కీలక నాయకులతో వరసగా మంతనాలు సాగించి.. కొందరిని తమ పార్టీలో చేర్చుకున్నారు కమలనాథులు. మధ్యలో ఈ ప్రక్రియకు బ్రేక్ వచ్చింది. ఇప్పుడు […]
మొన్న పంచాయతీలు.. నిన్న పరిషత్‌లు.. తర్వాత మున్సిపాలిటీలు.. ఇప్పుడు కుప్పంలో బాబు పీఠం కదల్చడమే టార్గెట్‌గా పెట్టుకున్నారట అధికారపార్టీ నేతలు. ఫార్టీ ఇయర్స్ సీనియర్‌ను ఢీకొట్టడానికి ఓ యువనేతను బరిలో దించుతారనే టాక్ చిత్తూరు జిల్లా వైసీపీలో ఓ రేంజ్‌లో ఉంది. ఇంతకీ వైసీపీ వ్యూహం ఏంటి? ఎవరిని పోటీకి పెట్టబోతోంది? కుప్పంలో వైసీపీ దూకుడు పెంచుతుందా? కుప్పం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అన్ని ఎన్నికలు ముగిసినా కుప్పం ఇంకా వార్తల్లోనే ఉంటోంది. ఈసారి […]
భారత్- రష్యా మధ్య అనుబంధం ఈనాటిది కాదు. గత ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాలు కలిసి నడుస్తున్నాయి. అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో మనకు రష్యా అండదండలు ఎనలేనివి. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో భారత్ తటస్థ వైకరి అవలంభించినప్పటికీ సోవియట్ యూనియన్‌తో సన్నిహితంగా ఉంది. అప్పట్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది. దాంతో పాటే ఏకదృవ ప్రంపంచం […]