వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హవేలీ ఘనపూర్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి షర్మిల వెళ్లనున్నారు. రైతు కరణం రవి కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. వరి సాగు వేయవద్దన్న ప్రభుత్వ ప్రకటనతో సీఎంకు లేఖ రాసి రైతు కరణం రవి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా.. అంతకు ముందు.. కేసీఆర్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ”రైతులను కోటీశ్వర్లు చేశానని గప్పాలు కొట్టే దొర గారు, ఆ […]
మన దేశంలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ ప్రారంభమైపోయిందని నిపుణులు అభిప్రయాపడుతున్నారు. ఒమిక్రాన్ భయాల కారణంగా మహారాష్ట్ర సర్కార్ పలు ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు దేశంలో 32 మందికి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా సోకింది. అయితే, ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే.. మహా రాష్ట్రలో ఏకంగా.. 7 కొత్త […]
సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ రాశారు. గిరిజనులకు పథకాలు దూరం చేసే అడ్డగోలు నింబధనలు తొలగించాలని లేఖలో పేర్కొన్నారు నారా లోకేశ్. గిరిజనులకు నిలిపివేసిన పెన్షన్, రేషన్‌ను పునుద్దరించాలని కోరారు. 10 ఎకరాల భూమి, వాహనం ఉంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఈ నిబంధనలు ఆదివాసీల పాలిట శాపంగా మారాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఏడాది ఆదాయం 25 వేలు కూడా ఉండదన్నారు. గిరిజనులకు పథకాలను […]
ఇండియా కరోనా కేసులు పెరుగుతూ…తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,992 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 393 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 93,277 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 34114331 కు చేరింది. అలాగే మరో వైపు.. దేశవ్యాప్తంగా […]
గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. రాజీనామాల పర్వానికి తెరలేచింది. పార్టీ పదవుల పంపకం, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై అసంతృప్తి నేతల్ని పార్టీ వీడేలా చేసింది. ప్రియాంకా గాంధీ పర్యటన సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వరుసగా పదేళ్ల UPA పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ మసకబారిపోయింది. క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతోంది. అయితే, పార్టీకి మళ్లీ జవసత్వాలు ఊదడానికి ప్రయత్నిస్తున్నారు ప్రియాంక గాంధీ. వచ్చే ఏడాది […]
ఐదోసారి వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచాడు మగ్నస్ కార్లసన్. ఎనిమిదేళ్ల క్రితం వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపర్చారు కార్లసన్. అప్పుడు అతని వయస్సు 22 ఏళ్లు. అప్పటికి విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. 2013, 2014లో ఆనంద్‌ను ఓడించిన కార్లసన్, 2016లో కిరాకిన్‌ను, 2018లో కరువానాను ఓడించి టైటిల్ అందుకున్నాడు. తాజాగా, రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమ్‌నియాషిపై గెలిచి ఐదో సారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. విశ్వనాథన్ […]
కిట్టీ పార్టీలతో చిట్టీలతో చేసి డబ్బులు ఎగ్గొట్టిన శిల్ప కేసులో… పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. శిల్పను 3 రోజుల కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించడంతో ఆమెను చంచల్‌గూడ జైలునుంచి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.. ఇప్పటికే శిల్ప కాల్ రికార్డ్స్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆస్తులు, బినామీలపై ఆరా తీస్తున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ల వద్ద డబ్బులు తీసుకున్నట్లు శిల్పపై కేసు నమోదు అయింది. నార్సింగి ఎస్‌ఓటీ కార్యాలయంలో శిల్పను పోలీసులు మొదటిరోజు ప్రశ్నించారు. ఆమె జరిపిన […]
కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సీన్లు వచ్చేశాయి… ఇక మనం భయపడాల్సిన పనిలేదు అనుకున్నారంతా. కానీ… కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంది. ఒమిక్రాన్‌గా విజృంభిస్తోంది. రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్న వాళ్లను సైతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 59 దేశాలకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. ఆయా దేశాల్లో 2 వేల 936 మందికి ఒమిక్రాన్ సోకినట్టు ఇప్పటి వరకూ స్పష్టమైంది. అలాగే, కరోనా సోకినట్టు నిర్ధారణైన 78 వేల మందిలో […]
ఏపీలో న్యాయపరమైన వ్యవహరాలపై జస్టిస్ చంద్రు కీలక కామెంట్లు చేశారు. ఏపీలో న్యాయ వ్యవస్థ ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని…హైకోర్టు తీర్పు ఇవ్వకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని చట్టాలను ఉపసంహరించుకుందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం కోర్టులను ఎదుర్కొలేక చట్టాన్ని ఉప సంహరించు కుందని…ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల విచారణ చేపడుతున్న కొందరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములు ఉన్నాయని వెల్లడించారు. విచారణ చేపడుతున్న కొందరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములున్నాయని ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది.. ఆ జడ్జీలు […]
ఇండియాలో రోజు రోజు కు బంగారం ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44, 960 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 10 పెరిగి రూ. 49, 050 కి చేరింది. ఇక అటు వెండి […]