చెదరని దశాబ్దాల స్నేహబంధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- రష్యా మధ్య అనుబంధం ఈనాటిది కాదు. గత ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాలు కలిసి నడుస్తున్నాయి. అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో మనకు రష్యా అండదండలు ఎనలేనివి. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో భారత్ తటస్థ వైకరి అవలంభించినప్పటికీ సోవియట్ యూనియన్‌తో సన్నిహితంగా ఉంది. అప్పట్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి.
సోవియట్ విచ్ఛిన్నం తరువాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది. దాంతో పాటే ఏకదృవ ప్రంపంచం ఏర్పడింది. వరల్డ్ ఓ గ్లోబల్ విలేజ్‌గా మారింది. మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ప్రపంచ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో పాటే కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో భారత్ విదేశీ విధానం కొంత మేర మారక తప్పలేదు.
Also Read
- Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
- Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ దేశాలు తమ విధానాల నుంచి కొంచెం పక్కకు తప్పుకుంటున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించవలసిన అవసరం ఏర్పడింది. భారత్, రష్యాలు ఇందుకు మినహాయింపు కాదు. దాంతో, ఇరు దేశాల మైత్రీ బంధంలో కొంత దూరం ఏర్పడిన భావన ఏర్పడింది.
ఇటీవల కాలంలో చైనాతో రష్యా మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఇదే సమయంలో భారత్‌కు అమెరికా దగ్గరైంది. ఇండో-–పసిఫిక్ప్రాంతం విషయంలో అమెరికా బాటలో ఇండియా నడుస్తోందని రష్యా అనుకుంటోంది. అలాగే చైనా చెప్పినట్టు రష్యా నడుచుకుంటుందన్నది భారత్ అనుమానం. దాంతో రెండు దేశాల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందనిపించింది. ఐతే, పుతిన్ తాజా పర్యటనతో అన్ని అనుమానాలు తొలగిపోయాయి.
మరోవైపు , ఇరాన్ విషయంలో భారత్ వైకరి మారింది. గతంలో మన చముర అవసరాలలో 10 శాతం ఇరాన్ నుంచి దిగుమతి అయ్యేది. కానీ ఇప్పుడు అది ఆగిపోయింది. ఇది భారత్ తనకు తాను తీసుకున్న నిర్ణయం కాదు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి అలా చేయాల్సి వచ్చింది. భారత్ దూరమైన తరువాత ఇరాన్‌కు రష్యా దగ్గరైంది. ఐతే, ఇరాన్ మాదిరిగా రష్యా విషయంలో అమెరికా ఒత్తిడికి భారత్ లొంగలేదు. రష్యా నుంచి కాకుండా తమ నుంచి రక్షణ పరికరాలు కొనాలని అగ్రరాజ్యం ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదు. 2018లో ఇండియా -రష్యా మధ్య కుదిరిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్సిస్టం కొనుగోలు ఒప్పందానికే కట్టుబడి ఉంది.
కోవిడ్ వేళ పుతిన్ పూర్తిగా రష్యాకే పరిమితమయ్యారు. ఈ రెండేళ్లలో ఆయన రెండే రెండు సార్లు కాలు బయటపెట్టారు. మొదటిసారి, ఈ జూన్‌లో జెనీవాలో బైడన్‌తో జరిగిన శిఖరాగ్ర చర్చల్లో పాల్గొన్నారు. దాని తర్వాత ఇప్పుడు భారత్ పర్యటన. ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలకు ఇది తాజా ఉదాహరణ. ప్రస్తుత పరిస్థితులో పుతిన్ భారత పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.
పుతిన్ పర్యటనలో భాగంగా ఉభయ దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. సైబర్ సెక్యూరిటీ నుంచి రైఫిల్స్ తయారీ వరకు మొత్తం 28 ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. పదేళ్ల పాటు కొనసాగే మిలటరీ సాంకేతిక సహకార ఒప్పందం వీటిలో కీలకమైంది. ఉత్తరప్రదేశ్‌లో ఏకే 203 అసల్ట్ రైఫిల్స్ తయారీకి కూడా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆరు లక్షల రైఫిల్స్ తయారవుతాయి. ఇండియన్ ఆర్మీకి రక్షణ విడి భాగాలు అందించేందుకు రష్యా అంగీకరించింది. పుతిన్భారత్లో ఉన్నది కొన్ని గంటలే కావచ్చు, కానీ చర్చలు గొప్పగా ముగిసాయని చెప్పాలి. అందుకు ఈ ఒప్పందాలే ఉదాహరణ.
మరోవైపు, 1971 నాటి శాంతి సహకార ఒప్పందానికి ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ అర్థ శతాబ్ద కాలంలో ప్రపంచం ఎంత మారినా భారత్-రష్యా మైత్రీ బంధం మారలేదని పుతిన్ పర్యటన చెప్పకనే చెప్పింది!
తాజావార్తలు
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!