ఢిల్లీః తమిళ నాడు లో నిన్న జరిగిన హెలి కాప్టర్ ప్రమాదంలో… 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించడం విషాదకరం. ఇది ఇలా ఉండగా… శుక్రవారం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఈ నేపథ్యంలోనే… రేపు సాయంత్రం ఆర్మీ విమానంలో ఢిల్లీకి పార్థివదేహాలను తరలించనున్నారు. శుక్రవారం ఢిల్లీలోని నివాసంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నివాళులర్పించేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. అనంతరం కామరాజ్ మార్గ్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర జరుగనుంది.