తెలంగాణలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,961 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,32,784 కి చేరింది. ఇందులో 4,80,458 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 49,341 కేసులు యాక్టివ్ గాఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 30 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,985 కి చేరింది. అయితే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో 631 కరోనా కేసులు నమోదయ్యాయి.