ఎంపి రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ. రఘురామరాజు ఒక మానసిక రోగి అని…ఆయనకు ముందు మానసిక వైద్యం చేయించాలని ఆయన ఎద్దేవా చేశారు. ఎం.పీగా గెలిచిన తర్వాత నరసాపురం నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏమీ లేదని..దమ్ముంటే ఎం.పీ పదవికి రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎవరి ప్రోద్భలంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలవాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ గారిని, పార్టీ పెద్దలను, ప్రభుత్వంపై బురద జల్లితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు స్పందించని వాళ్ళు ఇప్పుడు ఎంపీని అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారని చురకలు అంటించారు. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే ఎంపి రఘురామకృష్ణరాజును గుంటూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు.