రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. వేములవాడలోని జాతర గ్రౌండ్ కు చెందిన 25 సంవత్సరాల యువకుడు మృతి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందినట్లు సమాచారం. అలాగే వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన 52 సంవత్సరాల మహిళలో కూడా బ్లాక్ ఫంగస్ గుర్తించారు వైద్యులు. హైదరాబాదులోని పలు ఆస్పత్రుల్లో తిరిగిన రోగిని తీసుకునేందుకు నిరాకరించారు వైద్యులు. సంగారెడ్డిలోని పద్మావతి హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం ఆ మహిళను అడ్మిట్ చేశారు బంధువులు. అదే విధంగా మూడు రోజుల క్రితం చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకింది. ఆ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారు.