తెలంగాణ ప్రభుత్వంపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణలో పరిపాలన కోమాల్లో ఉందని..పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రతిపక్ష నాయకులతో కమిటీ వేశారని చురకలు అంటించారు. తెలంగాణ సర్కార్ ఇకనైనా ఒంటెద్దు పోకడలు మానుకోవాలని.. కరోనా అందరినీ కబలిస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కూడా అందివ్వడం లేదని.. కేటీఆర్ కు టాస్క్ ఫోర్స్ బాధ్యత ఇవ్వగానే వ్యాక్సిన్ వేయడమే మానేశారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో కేసులు పెరుగుతున్నా పరీక్షలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని..జనం చస్తుంటే..అంతా బాగుంది అనడానికి సిగ్గు ఉండాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి ధరలు నిర్ణయించండి అని కోర్టు ఆదేశించిందని.. సీఎం కెసిఆర్ టాస్క్ ఫోర్స్ వేస్తూ జీఓ ఇచ్చారు కానీ.. టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందో తెలియదని చురకలు అంటించారు భట్టి విక్రమార్క.