ఈటల ఎపిసోడ్ తో టీఆర్ఎస్ లో పెద్ద అలజడి మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈటల టీఆర్ఎస్ ను వీడటంతో.. ఆయన స్థానాన్ని మరో బీసీ నాయకుడితో భర్తీ చేయాలని గులాబీ బాస్ స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నేతలపై గురిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కూడా ఇటీవలే పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ నేతలు. అంతే కాదు టిఆర్ఎస్ పార్టీలోకి రమణ వెళుతున్నట్లు మీడియాలో వార్తలు […]
కరీంనగర్ జిల్లా అంటే సిఎం కేసీఆర్ కు ఎంతో మక్కువ అని.. ఈ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని మంత్రి గంగుల పేర్కొన్నారు. 14 కిలోమీటర్లు పట్టణంలో ఆర్ అండ్ బి రోడ్లు లైటింగ్ ఏర్పాటు చేశామని..ఇప్పటికే ఐటి టవర్ ప్రారంభం కావడం అక్కడ పనులు జరుగుతున్నాయన్నారు. సౌత్ ఇండియాలో మెదటిసారి కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి పునాది పడిందని..గండిపేట చెరువు కేబుల్ బ్రిడ్జి త్వరగా పనులు జరిగి ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు కరీంనగర్ […]
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేష్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి జగన్ కాదని…చంద్రబాబుకు లోకేష్ శత్రువని ఎద్దేవా చేశారు. లోకేష్ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఎదగదని….మనుషులను వాడుకుని వదిలేయడంలో లోకేష్, చంద్రబాబు సిద్ధహస్తులు అని మండిపడ్డారు. రఘురామ కృష్ణంరాజు లాంటి మా పాత మిత్రులు వారి తత్వాన్ని గమనించాలని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్షించేందుకు విశాఖకు వచ్చిన లోకేష్.. అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. […]
ఈటల రాజేందర్ ఎపిసోడ్ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ కరీంనగర్ అభివృద్దిపై ఫోకస్ చేసనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కరీంనగర్ లోయర్ మానేరు కింద చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికల పైన ఈరోజు హైదరాబాద్ నగరంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. మానేరు రివర్ ఫ్రంట్ ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రాజెక్టుతో సంబంధమున్న ఇరిగేషన్, […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని లేఖలు రాసిన ఆయన.. తాజాగా మరో లేఖ రాశారు. వరుస లేఖలతో ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రఘురామరాజు. పెళ్ళికానుక, షాదీ ముబారక్ పథకాలను ఈ లేఖలో ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే… పెళ్ళికానుక సహాయం పెంచుతామని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ సాయాన్ని లక్ష రూపాయలకు […]
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది ఏపీ సర్కార్. మునుపెన్నడూ లేని విధంగా సామాన్య ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది. అయితే తాజాగా కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు యజమానులుగా ఉన్న రైతులకు మాత్రమే అందుతున్న భరోసా.. కౌలు రైతులకు అందనుంది. ఏపీ సర్కార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం భూములు కౌలు రైతుల […]
కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ లో మరోసారి బంగారం పట్టుబడింది. మస్కట్ ప్రయాణీకుడి నుండి 1 కేజి 900 గ్రామల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. లాక్ డౌన్ సమయంలో కూడా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని ఎమర్జన్సీ లైట్ లో దాచిన స్మగ్లర్… కొచ్చిన్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్ లో విదేశీ బంగారం బయట పడింది. దీంతో బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు…ప్రయాణీకుడిపై కేసు నమోదు […]
సాహిత్యస్పూర్తి, సమయస్పూర్తి, సభాస్పూర్తి, స్నేహ స్ఫూర్తి కలబోసుకున్న స్పురద్రూపి సినారె. రాతకూ కూతకూ పాటకూ మాటకూ కలానికి గళానికి సరిహద్దులు చెరిపేసిన వారు. ‘నిలకడగా వున్న నీళ్లలో కమలాలే కాదు, క్రిములూ పుడతాయి’ అని రాసిన సి.నారాయణరెడ్డి నిజంగానే చలనశీలంగా బతికారు, కొన్నేళ్ల కిందట త్యాగరాయ గానసభ వేదికపై ఆ చరణాలు చెప్పి తన కవిత్వం ప్రవాహ గుణ ప్రధానమని వర్ణిస్తే నన్ను మెచ్చుకున్న సినారె సభలో పాల్గనని రోజు వుండేది కాదు. ఇంత సభా సంచారంలోనూ […]
జమ్మూకాశ్మీర్ కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు. ముఖ్యంగా భద్రత దళాలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరో దాడికి ఉగ్రవాదులు ఒడిగట్టారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ లో సిఆర్పిఎఫ్ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై గ్రానైట్ రాళ్లతో దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. మరో పోలీసు, ముగ్గురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్ తోయిబా […]
ఈటల రాజేందర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. హుజరాబాద్ ఎన్నిక అభివృద్ధి చేసిన పార్టీకి…అభివృద్ధి చేయని పార్టీలకు మధ్య పోటీ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేస్తూ మాట్లాడిన మాటలకు అభ్యంతరం చెబుతున్నామని.. ఏది ధర్మం… ఏది అధర్మం అని ఈటలపై మండిపడ్డారు. కేసీఆర్, టిఆర్ఎస్ లేకుంటే ఈటల ఎక్కడ ఉండేవారు ? ఈటలను అనేక విషయాల్లో కేసీఆర్ నమ్మారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ తనకు తాను తప్పులు […]