కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ లో మరోసారి బంగారం పట్టుబడింది. మస్కట్ ప్రయాణీకుడి నుండి 1 కేజి 900 గ్రామల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. లాక్ డౌన్ సమయంలో కూడా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని ఎమర్జన్సీ లైట్ లో దాచిన స్మగ్లర్… కొచ్చిన్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్ లో విదేశీ బంగారం బయట పడింది. దీంతో బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు…ప్రయాణీకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.