ఈటలపై మరోసారి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యమని..మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ కు ఉద్యమం నుండి ఇప్పటి వరకు సముచిత స్థానం ముఖ్యమంత్రి ఇచ్చారని.. ముఖ్యమంత్రికి ఈటల రాజేందర్ కు మధ్యలో ఎం జరిగిందో నాకే కాదు ఇక్కడున్న వారికి ఎవ్వరికీ తెలియదని కామెంట్ చేశారు. ఈటల రాజేందర్ కు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలి…ఒక్కటే కారణం ముఖ్యమంత్రి కార్యాలయానికి […]
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టిడిపి నేత నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అనుసరించిన డిజిటల్ వాల్యుయేషన్ పై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో గవర్నర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని లేఖలో కోరారు లోకేష్. ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ప్రతిష్టని దెబ్బతిస్తున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ సభ్యులను నియమించే అధికారం ఉన్న మీరు తక్షణమే జోక్యం చేసుకొని అభ్యర్థుల్లో నెలకొన్న […]
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు పెరిగిన కేసులు.. ఇప్పడు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 91,621 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1280 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 15 మంది కోవిడ్ బారినపడి మృతిచెందగా.. ఇదే సమయంలో 2261 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య […]
అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పల్లెలు పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లు , జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కంకణబద్దులు కావాలని, గ్రామాలు పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు […]
ప్రధాని మోడీకి తమిళనాడు సిఎం స్టాలిన్ లేఖ రాశారు. కావేరీ బేసిన్ లో హైడ్రోకార్బన్ వెలికితీత బిడ్డింగ్ ను వెంటనే ఆపేలా పెట్రోలియం, సహజ వనరుల శాఖను ఆదేశించాలని ప్రధాని మోడీని లేఖలో స్టాలిన్ కోరారు. కావేరి బేసిన్ రైతులకు ఈ ప్రాజెక్టు ముప్పుగా మారనుందని, ఆ ప్రాంత పర్యావరణ పరిరక్షణకు ఇది విఘాతం కలిగిస్తుందని ప్రధానికి లేఖలో స్పష్టం చేశారు స్టాలిన్…ఈ అంశంలో వెంటనే కల్పించుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఈ తరహా ప్రాజెక్టులపై ముందుకెళ్లే ముందు […]
భూములు అమ్మాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. సమైక్య రాష్ట్రంలో భూముల కోల్పోయాం అనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో దోపిడీ జరిగింది.. నేను కూడా అలాగే చేస్తా అంటే ఎలా ? అని ప్రశ్నించారు. జనం నిన్ను కూడా అలాగే సాగనంపుతారని కెసిఆర్ ను హెచ్చరించారు. అప్పులు ఓ వైపు..భూముల అమ్మకం ఇంకో వైపు రాష్ట్రాన్ని దివాలా తియించడమే అని.. భూముల అమ్మకాన్ని నిలిపి వేయాలని భట్టి […]
ఈ నెల 15 నుండి రైతుబంధు పథకం నిధులు విడుదల కానున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వరసగా ఏడోసారి రైతుబంధు నిధులు విజయవంతంగా రైతుల ఖాతాలలోకి రానున్నాయి. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గాను రూ.14,656.02 కోట్లు విడుదల కాగా, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్ లో రూ.14,800 కోట్లు కేటాయించి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఐతే తాజాగా రైతుబంధుకు 63.25 లక్షల మంది అర్హులు అని […]
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 6770 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1809844 కు చేరింది. ఇందులో 1712267 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 85,637 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 58 మంది […]
గజ్వేల్ లో సిఎం కేసిఆర్ కాలు పెట్టడం చాలా అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు. 7 కోట్ల 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యంతో గజ్వేల్ దశ, దిశ మారిందని..గజ్వేల్ ప్రజలు కలలో కూడా ఊహించనంత అభివృద్ధి జరిగిందన్నారు. కసికడు నీళ్ల కోసం ఇబ్బంది పడ్డ గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తెచ్చి […]
వాయువ్య బంగాళ ఖాతం పరిసర పశ్చిమ బెంగాల్ తీరం, ఉత్తర ఒడిస్సా ప్రాంతంలో స్థిరంగా అల్పపీడనము కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు వ్యాపించింది. రాగల 2 నుండి 3 రోజులలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా, జార్ఖండ్,ఉత్తర ఛత్తీస్ఘడ్ మీదగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుండి దక్షిణ ఛత్తీస్ఘడ్, ఉత్తర తెలంగాణా, ఉత్తర మధ్య […]