కరీంనగర్ జిల్లా అంటే సిఎం కేసీఆర్ కు ఎంతో మక్కువ అని.. ఈ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని మంత్రి గంగుల పేర్కొన్నారు. 14 కిలోమీటర్లు పట్టణంలో ఆర్ అండ్ బి రోడ్లు లైటింగ్ ఏర్పాటు చేశామని..ఇప్పటికే ఐటి టవర్ ప్రారంభం కావడం అక్కడ పనులు జరుగుతున్నాయన్నారు. సౌత్ ఇండియాలో మెదటిసారి కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి పునాది పడిందని..గండిపేట చెరువు కేబుల్ బ్రిడ్జి త్వరగా పనులు జరిగి ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం కానుందని.. మానేరు రివర్ ఫాంట్ గా బడ్జెట్ లో 100 కోట్లు విడుదల అయ్యాయని పేర్కొన్నారు..మరో ఐదు చెక్ డ్యాంలకు 80 కోట్లు విడుదల అవుతున్నాయని…మానేరు కేబుల్ బ్రిడ్జి 190 కోట్ల ఖర్చుతో సిద్ధము అవుతుందన్నారు. మానేరు బిడ్జిలో 12 మీటర్లు నీటిని నింపి వాల్స్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇప్పటికే కరీంనగర్ లో ఇరిగేషన్ కోసం 320 కోట్లు విడుదల అయ్యాయని…ఎఈ కామ్ అనే కంపెనీ రివర్ ఫ్రాంట్స్ మెట్రో వంటి ప్రాజెక్టులు అద్భుతముగా చేస్తుందని పేర్కొన్నారు.ఈరోజు నుండి మానేరుపై డ్రోన్ తో సర్వే జరగనుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరీంనగర్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు గంగుల.