ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని లేఖలు రాసిన ఆయన.. తాజాగా మరో లేఖ రాశారు. వరుస లేఖలతో ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రఘురామరాజు. పెళ్ళికానుక, షాదీ ముబారక్ పథకాలను ఈ లేఖలో ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే… పెళ్ళికానుక సహాయం పెంచుతామని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ సాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని ప్రకటించినట్లు రఘురామరాజు పేర్కొన్నారు. పెళ్లికానుక పథకం వల్ల ప్రజల నుంచి మద్దతు లభించిందని.. అందుకే వైసిపి ఇంత భారీ విజయం సాధించిందని కూడా పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన జగన్ సర్కార్ నిలబెట్టుకోవాలని ఆయన లేఖలో కోరారు.