దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల, ఇవాళ తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల… తల్లి విజయమ్మతో కలిసి ఈరోజు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. సాయంత్రం పార్టీ జెండా, ఎజెండా ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో రాజన్న సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ తనయ షర్మిల పార్టీని ప్రకటించబోతున్నారు. read also : వాహనదారులకు షాక్.. మరోసారి […]
కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 9 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.56 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.62 కు చేరింది. read also […]
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేస్తూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే… మారిన ఈ కర్ఫ్యూ టైమింగ్స్ ఇవాళ్టి నుంచి అమలు కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది… read also : కిషన్ రెడ్డికి బంపర్ […]
కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు.. కొత్త మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు మోడీ. అయితే.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కిషన్‌రెడ్డికి ఏకంగా మూడు శాఖలను అప్పటించారు. read also : స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు తనకు ఏ శాఖ ఇచ్చినా… […]
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రోడ్ మాప్ సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు, అభ్యంతరాలు తెలిపినప్పటికీ… పట్టించుకోకుండా కేంద్రం ముందుకు వెళుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. read aslo : మగువలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు విశాఖ స్టీల్ ప్లాంట్‌తో దాని అనుబంధ సంస్థలన్నీ వంద శాతం అమ్ముతామని కేంద్రం ప్రకటించింది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ ప్లాంట్ మైన్స్‌ను కూడా […]
గత వారం రోజులుగా పెరుగుతున్న పుత్తడి ధరలు ఈరోజు మరోసారి భారీగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 44,650 కి చేరింది. ఇక […]
”ముక్కోటి వృక్షర్చన కార్యక్రమం” పోస్టర్ ను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ విడుదల చేశారు. ఈ నెల 24 న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టబోయే ముక్కోటి వృక్షర్చన కార్యక్రమం పోస్టర్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తో కలిసి ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ విడుదల చేశారు.
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి.. మాజీ మంత్రికి పడటం లేదట. పెత్తనం కోసం ఇద్దరూ ఫైటింగ్ చేస్తున్నారు. రెండువర్గాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. అదికాస్తా స్థానికంగా అధికారపార్టీలో రచ్చగా మారుతోంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం? జహీరాబాద్ టీఆర్‌ఎస్‌లో మాణిక్‌రావు వర్సెస్ ఫరీదుద్దీన్! మాణిక్‌రావు. ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే. ఇదే నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేత.. మాజీ మంత్రి ఫరీదుద్దీన్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. విభేదాలు తారాస్థాయికి చేరినట్టు పార్టీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. […]
అప్లయ్.. అప్లయ్ .. బట్ నో రిప్లయ్..! ఏపీ ఎక్సైజ్ శాఖకు ఈ సినిమా డైలాగ్ అతికినట్టు సరిపోతుంది. అవినీతి, అక్రమాలపై మంత్రి పూర్తిస్థాయి నివేదిక కోరినా.. అది బయటకు రాదు. తప్పు చేసిన వారిపై చర్యలూ ఉండవు. మంత్రినే ఏమార్చే ఘనులు అక్కడ తిష్ఠ వేశారు. పెద్ద గూడుపుఠాణి నడుపుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎక్సైజ్ శాఖలో లోపం ఎక్కడుంది? తెర వెనక ఉన్నది ఎవరు? గత ప్రభుత్వ హాయాంలో ఎక్సైజ్ శాఖలో అవినీతి […]
హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్‌ఎస్ వ్యూహం మార్చిందా? ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్టు ఎత్తుగడలు ఉండబోతున్నాయా? గుత్తగా గురిపెట్టడానికి ప్లాన్ సిద్ధమైందా? ఇంతకీ ఏంటా వ్యూహం? గులాబీ శిబిరం టార్గెట్ ఏంటి? హుజురాబాద్‌లో మారిన టీఆర్‌ఎస్ వ్యూహం? మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉపఎన్నిక జరిగే హుజురాబాద్‌లో అధికారపార్టీ పూర్తిస్థాయిలో పట్టు సాధించే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. సీనియర్ నాయకులు నియోజకవర్గాన్ని జల్లెడ పట్టినట్టుగా […]