మేషం : వృత్తిపరమైన ప్రయాణాలు, సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దైవ, పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభం : కొన్ని సంఘటనలు మిమ్మలను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. ఉన్నత విద్యల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. […]
వైఎస్ షర్మిల కొత్తపార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణలో షర్మిల పార్టీకి స్వాగతమని చెప్పిన పవన్ కల్యాణ్… ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలన్నారు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతించాలని… 2007 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నానని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. read also : టీఆర్ఎస్‌లోకి ఎల్. రమణ..కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ తెలంగాణ ఉద్యమ గడ్డ అని పేర్కొన్న పవన్ కల్యాణ్… కొత్త రక్తం, చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జనసేన […]
తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్. రమణ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్‌ను రమణ కలవనున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ పనిచేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ మరుగున పడటం, ఆ పార్టీతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఇలా పలు కారణాల వల్ల…టీఆర్‌ఎస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు ఎల్. రమణ. అయితే… టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎలాంటి హామీలు వచ్చాయే తెలియాల్సి ఉంది. read also : తెలంగాణలో […]
కడప : షర్మిల పార్టీ ప్రకటన నేపథ్యంలో కొండా రాఘవరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇడుపులపాయ వైఎస్ ఘాట్ వద్ద షర్మిలతో పాటు ఆయన కొండా రాఘవరెడ్డి నివాళర్పించారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ ఆర్ జయంతి సందర్భంగా నేడు తెలంగాణా వైఎస్ఆర్ పార్టీని ప్రారంభిస్తున్నామని… తెలంగాణా సంస్కృత, సంప్రదాయం ప్రకారం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఉంటాయని స్పష్టం చేశారు. read also : తెలంగాణలో కాంగ్రెస్ పాదయాత్ర..ఇవాళే […]
తెలంగాణ పీసీసీ కార్యరంగంలోకి దిగబోతోంది. కొత్త టీమ్‌తో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ఇవాళ సమావేశం కానున్నారు. రోజంతా పార్టీ ముఖ్య నాయకులతో భేటీలు నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇన్నాళ్లు తెలంగాణ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పీసీసీ కొత్త టీమ్ ఎంపిక పూర్తయిపోవడంతో… కార్యాచరణ మొదలెట్టింది. ఇప్పటికే పార్టీ చాలా నష్టం జరిగిందనీ… ఇకపై యాక్షన్‌లోకి దిగాలని […]
ఇండియాలో కరోనా కేసులు నిన్నటి కంటే కాస్త పెరిగాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 45,892 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,09,557 కి చేరింది. read also : కరోనా మరో కొత్త రూపం.. 30 దేశాల్లో గుర్తింపు ఇందులో 2,98,43,825 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,60,704 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 […]
కరోనా వైరస్ మరో కొత్త రూపం లోకి మారింది. లాంబ్డా వేరియంట్‌తో ఐరోపా దేశాల్లో భయాందోళనలు సృష్టిస్తుంది. దీంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లాంబ్డా వేరియంట్‌పై పరిశోధనలు జరిపిన మలేషియా ఆరోగ్య మంత్రిత్వశాఖ సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా డెల్టా రకం కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని ప్రకటించింది. ప్రపంచంలోని 30 దేశాల్లో విస్తరించిన లాంబ్డా వేరియంట్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించవచ్చని షాకింగ్ న్యూస్ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు […]
రెండవసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్లతర్వాత తన మంత్రివర్గాన్ని దాదాపు సమూలప్రక్షాళన చేసిన ప్రధాని మోడీ చర్యలో స్పష్టమైన రాజకీయ సంకేతాలున్నాయి. తన ప్రభుత్వమూ బిజెపి కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నాయనే వాస్తవాన్ని ఆయన అంగీకరించారు. దీన్ని విస్తరణ మార్పు అనేకంటే తిరగనేత అనడం మెరుగు. 52మ ంది మంత్రులుంటే 43 మంది మార్పులతో సహా చేరడం 12 మందిని బయిటకు పంపించడం గతంలో ఎన్నడూ జరిగివుండదు.ఇదంతా ఎన్నికల వ్యూహంతో చేశారని బిజెపి నేతల పైకి చెప్పుకోవచ్చు గాని […]
రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్స్ నిలిచిపోనున్నాయి. యూపీఎస్ స్థాయి పెంపు నేపథ్యంలో ప్రభుత్వం వెబ్ సైట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు ప్రభుత్వ వెబ్ సైట్లకు అంతరాయం ఏర్పడనుంది. ఈ అంతరాయం కారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వుల జారీ నిలిచిపోనుంది. read also : కరీంనగర్ జిల్లాలో కోళ్లకు వింత వ్యాధులు ! అంటే.. ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ […]
కరీంనగర్ జిల్లాలో బాయిలర్ కోళ్లు వింత వ్యాధికి గురై మృత్యువాత పడుతున్నాయి. ఎదిగిన కోళ్లు విక్రయించే సమయంలో వేలల్లో చనిపోవడంతో పౌల్ట్రీ ఫారం యజమానులు తీవ్రంగా నష్టపో తున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వింత వ్యాధులు నుండి కోళ్లను కాపాడుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉపాధిగా వందల సంఖ్యలో కోళ్ల ఫారాలు ఏర్పడ్డాయి. దాదాపు 50 లక్షలకు పైగా కోళ్లను పెంచుతున్నారు. అయితే వింత రోగాలతో వేలాది కోళ్లు మృతి […]