ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడ్డారా? షెడ్యూల్, నాన్ షెడ్యూల్ వివాదంలో ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నారా? మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు మరోమాట మాట్లాడుతున్నారా? ఇంతకూ ఎవరా ఎమ్మెల్యేలు? ఆ తగువు వెనక అసలు కథేంటి? విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్‌పై చర్చ విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్ అంశం మళ్లీ వేడెక్కడంతో మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడుతున్నారని టాక్. 9 మండలాల పరిధిలో ఉన్న 163 రెవెన్యూ గ్రామాల్లో 80 […]
వీళ్లు అనుమానిస్తున్నదే అక్కడ జరిగిందా? తీగ లాగితే డొంక బయట పడుతుందనే భయం మొదలైందా? అందుకే తెర వెనక ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఇది వారి ఆలోచనా.. లేక వారి వెనకున్న వారి ఆలోచనా? తప్పించుకునేందుకు ఆదిలోనే తోవలు వెతుకుతున్నారా? నిధుల గోల్‌మాల్ వెనకున్న పెద్దలు బయటకొస్తారనే ‘రాజీ’ ప్రయత్నాలు? జగన్ ప్రభుత్వం నాటి టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలు తవ్వే పని నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఒకటొకటిగా దర్యాప్తు చేయడం.. కేసులు నమోదు కావడం చకచకా జరిగిపోతున్నాయి. […]
ఆయన మనసు మార్చుకున్నారా? కాషాయ జెండానే తన అజెండా అని చెబుతూ దూకుడు ప్రదర్శించి.. ఇంతలోనే మారు మనసు పొందారా? సొంత పార్టీతో రాజీపడ్డారా లేక.. అప్పుడే తొందరపడటం ఎందుకునుకున్నారా? ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఎందుకు పురివిప్పారు? దారిలోకి వస్తున్నారని అనుకుంటున్న సమయంలో మరో బాంబ్ పేల్చారు? ఇది వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా? రాజగోపాల్‌రెడ్డి యాక్టివ్ అయ్యారా? రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేసినా హల్చలే. నల్గొండ పాలిటిక్స్‌లో సోదరుల రూటు సెపరేట్. గడిచిన […]
తాడిపత్రి రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కూల్చివేతలు.. మాటల తూటాల వెనక పొలిటికల్ పన్నాగం ఇంకేదో ఉందనే చర్చ జరుగుతోంది. మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నారనే అనుమానం ఒకరిది. రూల్ పాటించకపోతే ఎలా అని చట్టానికి పదును పెడుతున్నారు ఇంకొకరు. దీంతో ఆదిపత్యపోరులో ఎవరు పైచెయ్యి సాధిస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది. ఆక్రమణల కూల్చివేతలతో రాజకీయ వేడి! ఏపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ పాగా వేసింది. జేసీ బద్రర్స్ ఎత్తుగడలే దానికి కారణం. సింపుల్ మార్జిన్‌తో […]
లెఫ్ట్ పార్టీల ప్రభావం ఉన్న హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎత్తుగడ ఏంటి? వామపక్షాల మద్దతు కూడగడుతుందా? గత ఉపఎన్నికల చరిత్ర ఏం చెబుతోంది? అవే వ్యూహాలు హుజురాబాద్‌లో రిపీట్ అవుతాయా? లెఫ్ట్ పార్టీల మద్దతు టీఆర్‌ఎస్ సంపాదిస్తుందా? హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, […]
అమరావతి: కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్‌సన్‌ట్రేటర్లు, డీ టైప్ సిలెండర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు తదితర వాటి నిర్వహణకోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని.. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు ఉంచాలని ఆదేశించారు. Read Also : డిస్నీ ప్లస్ […]
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోనే భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి పైలాన్ ను కూడా ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు సురక్షిత నది జలాలు వచ్చాయని….ఇది టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనత అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటించారని..ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత అని కొనియాడారు. ఇంటింటికి సురక్షిత నది […]
తిరుపతి : చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇతరులు ఇలా చాలా మంది కరోనా బారీన పడ్డారు. అయితే.. తాజాగా ఏపీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. […]
సిద్దిపేట : 70 ఏళ్ళలో చేయని పనిని 7 ఏళ్ళలో పూర్తి చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ గజ్వేల్ లో రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… అంతిమంగా గెలిచేది పనితీరే, మంచి తనమేనని… ఓట్ల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే పని చేశామని తెలిపారు. తెలంగాణలో కొత్తగా 3 లక్షల 9 వేల 83 మందికి రేషన్ […]