బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. రేపు ప్రారంభం కావాల్సిన యాత్ర కల్యాణ్ సింగ్ మరణంతో.. 28 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఓ వైపు కిషన్ రెడ్డి జనాశీర్వాద యాత్రతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు చుట్టేశారు. సంజయ్ పాదయాత్ర మాత్రం ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. కొన్నాళ్లు జోరుగా కనిపించిన బండి సంజయ్ ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. పదే పదే యాత్ర వాయిదా పడటంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో పార్టీలో ఆధిపత్య పోరు జరుగుతోందనే చర్చ నడుస్తోంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి పోటాపోటీగా యాత్రలను చేపట్టడంతో ఊహాగానాలు మరింతగా బలపడుతున్నాయి.