ఇవాళ బంగారం వ్యాపారులు సమ్మెకు దిగుతున్నారు. అభరణాలకు హాల్ మార్క్ తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ సమ్మె చేయనున్నారు. కేంద్ర నిర్ణయం వల్ల తమ వ్యాపారాలపై ప్రభావం పడిందని, హాల్ మార్కింగ్ కు 10 రోజులు పట్టడమే కారణమని ఆలిండియా జెమ్ అండ్ జ్యూవెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ తెలిపింది. దీంతో ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ షాపులు అందుబాటులో ఉండకపోవచ్చు. నకిలీ ఆభరణాలను నియంత్రించేందుకు జూన్ 16 నుంచి కేంద్రం హాల్ మార్క్ రూల్ పెట్టింది. ఇది ఇలా ఉండగా..తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గడంతో.. రూ.48,160కు దిగివచ్చింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గడంతో రూ. 44,140 కు క్షీణించింది. ఇవాళ బంగారం ధర తగ్గగా… మరోవైపు వెండి ధర మాత్రం భారీగా పెరిగింది.. కేజీ వెండి ధర రూ.4960 పెరిగి రూ.66,660 వద్ద నమోదైంది.