టీకాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటోంది. దళిత గిరిజన దండోరా సభలతో పాటు…దళిత బస్తీలను సందర్శించనుంది. సభలు నిర్వహించడంతో… కార్యకర్తల లో జోష్ వస్తుంది కానీ…అసలు జనం మనసులో ఏముందో తెలియాలంటే నేరుగా జనంలోకి వెళ్లాలని డిసైడయ్యింది. అందుకే.. ఈనెల 24, 25న జరిగే…దీక్షలకు తోడుగా… దళిత వాడల లో పర్యటించాలని నిర్ణయం తీసుకుంది. అది కూడా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లి గ్రామం నుంచే ప్రారంభించనుంది. తన దత్తత గ్రామానికే సీఎం ఏమీ చేయలేదని, అలాంటిది రాష్ట్రానికి ఏం చేస్తారనే చర్చ పెట్టాలన్నది కాంగ్రెస్ ఆలోచన. దీక్షతో పాటు… దళిత బస్తీలో 24న రాత్రి బస చేయబోతున్నారు రేవంత్. నిద్ర చేయడం, మరుసటి రోజు దళిత వాడలోని కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు. ప్రభుత్వం చేపట్టిన దళిత బంధుపైనా అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. దళిత వాడలకు పార్టీ క్యాడర్‌ను కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది పార్టీ. కేవలం కాలనీ వాసులకు మాత్రమే ఇష్టాగోష్టి కి అనుమతి ఇవ్వాలని స్థానిక నాయకత్వానికి అదేశాలు జారీ చేసింది టీకాంగ్రెస్.