హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ పరుపుల గోదాంలో మంటలు చెలరేగాయ్. ఐతే…మంటలను గమనించిన కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో పరిశ్రమ అంతటా మంటలు వ్యాపించాయి. పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది…మంటలను అదుపు చేస్తున్నారు. గోదాంలోంచి కార్మికులు బయటకు రావటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై క్లారిటీ రాలేదు.