అప్ఘనిస్తాన్ పై తాలిబాన్లు దురాక్రమణ చేయడంతో అక్కడి పరిస్థితులన్నీ రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అప్ఘన్లో తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ప్రకటించుకున్న తాలిబన్లు ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో దారుణంగా విఫలమవుతున్నారు. దీనికితోడు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ప్రకటించడంతో తాలిబన్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్ఘన్లు అక్కడ బ్రతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరినీ తాలిబన్లు కిడ్నాప్ చేస్తారో? ఎవరిపై కాల్పులు జరుపుతారో తెలియక బిక్కుబిక్కుమంటూ […]
మంత్రిగా.. ఎంపీగా చేసిన ఆయన సడెన్‌గా పొలిటికల్ తెర నుంచి కనుమరుగయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ నల్లపూసై చర్చగా మారారు. ఆయనది మౌనమా? వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏమా కథ? టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? నిమ్మల కిష్టప్ప. అనంతపురం జిల్లాలో సీనియర్ టీడీపీ నాయకుడు. సుదీర్ఘకాలం మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 2019లో హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఓడిన తర్వాత రెండున్నరేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు ఆయన ఎక్కడున్నారో.. […]
ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒకసారి.. ఓడింది రెండుసార్లు. పార్టీ అవకాశం ఇచ్చినా నెగ్గుకు రాలేకపోయారు. ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటలా తయారైంది. ఈసారి కష్టమని భావించారో ఏమో ఇంకో నియోజకవర్గంపై కర్చీఫ్ వేయాలని చూస్తున్నారట. దీంతో ఆయనకు పార్టీ ఛాన్స్ ఇస్తుందా లేక.. షాక్ ఇస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరాయన? మాడుగుల టీడీపీలో గ్రూప్ ఫైట్! విశాఖ జిల్లా మాడుగుల. టీడీపీ ఆవిర్భావం తర్వాత మాడుగుల నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే […]
ఆ అధికారపార్టీ ఎంపీ ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరుస్తున్నారా? సొంత సామాజికవర్గమే కావడంతో పక్క నియోజకవర్గ ఎంపీతో స్నేహబంధాన్ని బలోపేతం చేస్తున్నారా? ఇదంతా సేఫ్ గేమ్‌లో భాగమా లేక.. భవిష్యత్ రాజకీయ వ్యూహమా? సొంత పార్టీలోనూ అనుమానాలకు బీజం పడిందా? ఎవరా అధికార పార్టీ ఎంపీ? ఏంటా స్నేహగీతం..! ఎంపీ పాటిల్ కొత్త స్నేహాలపై చర్చ! బీబీ పాటిల్. జహీరాబాద్ ఎంపీ. టీఆర్‌ఎస్ నుంచి వరసగా రెండోసారి గెలిచారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా.. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎన్నికల్లో […]
నిర్మల్ సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా.. వైరిపక్షాలకు చురకలు వేశారా? తెలంగాణ కమలనాథులు ఆశించింది జరిగిందా? కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపారా లేదా? షా పర్యటనపై బీజేపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! అమిత్ షా మాటలు చురుకు పుట్టించాయా? తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సభకు వచ్చారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ కార్యక్రమానికి భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు శ్రమించారు. […]
హైలెట్ అవ్వాలంటే హడావిడి చేయాలన్నదే ఆ ఎమ్మెల్యే ఫిలాసఫీనా? అధినేత దృష్టిలో పడి పదవి పొందాలనుకుంటున్నారా? అందరి కంటే ముందుండాలని అనుకున్నారా? తాజా రచ్చ వెనక కారణం అదేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? జోగి రమేష్ దూకుడు వెనక కారణం వేరే ఉందా? మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. సీఎంను పట్టుకుని అంత మాట అంటావా అని ఏకంగా చంద్రబాబు ఇంటి దగ్గర రభస చేశారు […]
కరోనా ప్రభావంతో ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ ఇవాల్టి నుంచి పునః ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌తో దుబాయ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ లీగ్ మొదలుకానుంది. భారత్‌లో జరిగిన మొదటి దశలో 29 మ్యాచులు జరిగాయి. ఇంకా 31 మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతోపాటు ఆటగాళ్లకు కరోనా సోకడంతో నిరవధికంగా వాయిదా వేశారు. అప్పటి నుంచి బీసీసీఐ చేసిన ప్రయత్నాలు […]
బీజేపీ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందా? అంటే అంత అవుననే సమాధానం విన్పిస్తోంది. నిన్నటి వరకు బీజేపీ అధిష్టానం వరుసబెట్టి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చేసింది. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏకంగా ఆరుగురు సీఎంలను మార్చివేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ లో బీజేపీ తరహా ఫార్మూలానే ఫాలో అవుతోంది. అక్కడి సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై వేటు వేసింది. […]
అమరావతి : ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ధాఖలు అయింది. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో నిందితుడు సాంబశివరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ హౌస్ మోషన్ పిటిషన్ స్వీకరించింది ఏపీ హైకోర్టు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్న IRTC అధికారి సాంబశివరావు… గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ యండి గా విధులు నిర్వహించారు. కేంద్ర సర్వీసులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కేంద్రప్రభుత్వం అనుమతి తీసుకోవాలని పిటిషన్ లో […]
చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ దూసుకుపోతుంది. ఆ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లోనూ వైయస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్సార్‌సీపీకి 17, టీడీపీకి 2 గెలిచాయి. అలాగే…. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా గెలిచింది వైయస్సార్‌సీపీ. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా గెలిచింది వైయస్సార్‌సీపీ. ఇక శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైయస్సార్‌సీపీ, 1 చోట టీడీపీ గెలుపొందాయి. మరో 6 చోట్ల ఫలితాలు […]