కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించిన ఐటీ కంపెనీలు…. నెమ్మదిగా వారందరినీ కార్యాలయాలకు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. విడతల వారీగా తమ ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని సూచిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు, కుటుంబసభ్యులకు నూరు శాతం వ్యాక్సినేషన్ త్వరలో ముగియనుండడంతో.. వెనక్కు రప్పించే కసరత్తు ముమ్మరం చేశాయి. కొన్ని దేశీయ పెద్ద కంపెనీలు, చిన్న, మధ్యతరహా ఐటీ సంస్థలు దసరా నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కనీసం 50శాతం ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేసేలా […]
ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఫలితాల్లో వైసీపీ ఫ్యాన్ గాలి వీచింది. 13 జిల్లాల్లో అధికార పార్టీ హవా చాటింది. ఇప్పటి వరకు 90శాతానికిపైగా జడ్పీటీసీలను వైసీపీ గెలుచుకోగా.. టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎంపీటీసీల్లోనూ వైసీపీ.. సత్తా చూపింది. చాలా జిల్లాల్లో క్వీన్ స్వీప్ చేసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ.. భారీస్థాయిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో అధికారపార్టీ గెలిచింది. ఈనెల 25న జడ్పీచైర్మన్ల ఎన్నిక జరగనుంది.. ఆంధ్రప్రదేశ్‌లో 6 వేల 985 ఎంపీటీసీ, 441 […]
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు…. మరోసారి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. దావోస్‌లో 2022లో జరిగే WEF వార్షిక సమావేశానికి… హాజరు కావాలని కేటీఆర్‌ను WEF ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ఆహ్వానించారు. ఈ సమావేశం జనవరి 17 నుంచి 21 వరకు కొనసాగనుంది. తెలంగాణను సాంకేతిక శక్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న కృషిని బోర్గే బ్రెండే ప్రశంసించారు. WEF నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం […]
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైసీ రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ కెప్టెన్ గా 2021 సీజన్ వరకు మాత్రమే కొనసాగుతానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ సీజన్ అనంతరం ఐపీఎల్ టోర్నీ లో కేవలం ఆటగాడిగానే కొనసాగుతానని స్పష్టం చేశాడు విరాట్ కోహ్లీ. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన అభిమానులంతా స్వాగతిస్తారని అనుకుంటున్నానని పేర్కొన్నారు విరాట్ కోహ్లీ. యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ రెండో దశలో […]
ఐపీఎల్ 14 సీజన్… సెకెండ్ ఫేజ్ తొలి మ్యాచే టీ20 క్రికెట్‌లోని అసలు మజాను చూపించింది. ముంబై ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై బ్యాట్స్‌మాన్ సౌరభ్ తివారీ చివరి వరకు పోరాడినా.. విజయం మాత్రం లభించలేదు. 58 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సౌరభ్ తివారీ, కిరాన్ పొలార్డ్ కలసి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే పొలార్డ్, కృనాల్ పాండ్యా స్వల్ప వ్యవధిలో పెవీలియన్ […]
మేషం : ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ అవసరం. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపారంలో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. వృషభం : కొంతమంది మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం వల్ల ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. […]
ఆ రోజుల్లో ‘హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్’గా పేరొందిన జోసెఫ్ విస్సారియానోవిచ్ స్టాలిన్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అభిమానం ఉండేది. ఆయన పేరును తమ సంతానానికి పెట్టుకొనీ పలువురు భారతీయులు మురిసిపోయారు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవారు, హేతువాదులు స్టాలిన్ ను విశేషంగా అభిమానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సైతం స్టాలిన్ ను అభిమానించి, తన తనయుడికి ఆ పేరే పెట్టుకున్నారు. కరుణానిధి వారబ్బాయి ఎమ్.కె.స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘స్టాలిన్’ టైటిల్ […]
తిరుపతి : జగన్ కు సమానంగా లోకేష్ ను తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు పిచ్చి ఆలోచన అని… గత ఎన్నికల కన్నా వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకొని ప్రజాసేవ చేసుకోవాలి..అదే మంచిదన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలోనే చంద్రబాబు మళ్లీ పోటీ చేయాలని కోరుకుంటున్నానని… జగన్ చేసిన అభివృద్ధి వల్లే కుప్పంలో భారీ విజయం సాధించామని వెల్లడించారు. గత పాలకులు ఎన్నో ఏళ్లుగా స్థానిక పోరు జరపకుండా […]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఐక్యపోరాటాలు చేయాలని తెలంగాణ ప్రతిపక్షాలు నిర్ణయించాయి. గాంధీభవన్లో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఫోర్ పాయింట్ ఫార్ములాను ప్రకటించారు. పోడుభూములతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉమ్మడిగా కార్యక్రమాలు చేపడతామన్నారు నేతలు. తెలంగాణలో భూసమస్యలు, ధరణి వెబ్ సైట్ లోపాలపై సీరియస్ గా పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలిపాయి. గాంధీభవన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల […]
దేశంలో మహిళల, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందా? 2019 కంటే 2020లో అత్యాచార కేసులు పెరిగాయా? తగ్గాయా? ఎన్‌సీఆర్‌బీ నివేదిక ఏం చెబుతోంది. అత్యాచార కేసుల్లో…ఉత్తరాది రాష్ట్రాలే ముందున్నాయా ? మైనర్లపై దాడులు పెరగడం…ఆందోళన కలిగిస్తోంది.దేశంలో మహిళలపై రోజురోజుకు నేరాలు పెరుగుతూనే ఉన్నాయ్. మృగాళ్ల నుంచి మహిళలు, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా నిత్యం…సగటున 77 అత్యాచార కేసులు నమోదవుతున్నట్లు NCRB నివేదికలో వెల్లడైంది. దేశంలో ప్రతిరోజు సగటున 80 హత్యలు జరుగుతున్నాయి. ఇందులో భూ […]