మూడ్రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై చర్చిస్తారు. రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనుల సమీక్షకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే భేటీలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు […]
ఐపీఎల్‌లో సూపర్‌ఫామ్‌లో ఉన్న చెన్నై… మరోసారి జైత్రయాత్రను కంటిన్యూ చేసింది. యూఏఈ వేదికగా బెంగళూర్‌ను మట్టికరిపించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో కోహ్లీ టీమ్‌ను ఓడించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది చెన్నై. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 18.1 ఓవర్లలో చేధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ ఆకట్టుకున్నారు. రన్‌రేట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ, అంబటిరాయుడు ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన […]
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనుంది. 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదివారం అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమబెంగాల్-ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు […]
అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోడీ. శుక్రవారం…ఆదేశ అధ్యక్షులు జోబైడెన్‌తో సమావేశమయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని ఈ సందర్భంగా అన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం […]
మన దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. ఓ రోజు పెరిగితే… ఓ తగ్గుతున్నాయి. ఇక తాజాగా బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 43,200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 […]
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ.. ఇప్పటికే మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా.. నేడు జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇవాళ ఉదయం పది గంటల లోపు ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.. ఉదయం పది నుంచి ఒంటి గంట లోపు స్క్రూటినీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక ఉండనుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం.. మధ్యాహ్నం 3 గంటలకు […]
మేషం:- ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. వృషభం:- విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కివచ్చే ఆస్కారం […]
గెలుపోటములు దైవాదీనం. ఎవరినీ ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ముందుగానే చెప్పడం కష్టం. రాజకీయాల్లోనూ ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే తెలుసుకొని చిత్తు చేయాల్సి ఉంటుంది. అలాగే జనాల్లో ఫేస్ వాల్యూను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీ అధినేత చరిష్మా కూడా తోడైతే ఇక అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. కేవలం అధినేత ఫొటోతోనే గెలుపు సాధ్యమా? అంటే ఇందులో కొంత వాస్తవం ఉందనే చెప్పొచ్చు. […]
టాలీవుడ్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగచైతన్యకు మూడు తరాల ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సాయిపల్లవి డాన్స్ కు ‘ఫిదా’ కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘లవ్ స్టోరీ’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ఆర్మూర్ కు చెందిన రేవంత్ (నాగచైతన్య) హైదరాబాద్ లో ఫిట్ నెస్ బేస్డ్ డాన్స్ ఇన్ స్టిట్యూట్ […]
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యుల సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. శాసనసభ వారికి సంతాపం తెలిపింది. తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు శాసనమండలిలో ప్రొటెం స్పీకర్ హోదాలో భూపాల్ రెడ్డి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం మండలి కూడా సోమవారానికి వాయిదా పడింది. ఈ ఏడాది మార్చి 26వ తేదీన బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత రెండు ఆర్డినెన్సులను […]