ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 3.7కోట్లకు చేరింది. ప్రతి ఏడాది ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న మోడీ.. ఈ ఏడాది మార్చి 31 నాటి వివరాలను బహిర్గతం చేశారు. 2020లో 2.85కోట్లు ఉండగా.. ప్రస్తుతానికి ఆయన ఆస్తులు 22 లక్షలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి పొందే రూ. 2లక్షల జీతమే ప్రధానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉంది. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటివల్ల వచ్చే […]
జనసేన పవన్ కళ్యాణ్ కు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కళ్యాణ్ అని… విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడని చురకలు అంటించారు. పవన్ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలవలేక పోయాడని… టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటి ? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో […]
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. తాజా గా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 26,032 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 260 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 28,046 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,03,476 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య […]
దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనకు ఊతమివ్వడానికి సంయుక్త కిసాన్ మోర్చా సెప్టెంబర్ 27 న భారత్ బంద్‌కు సిద్ధమవుతోంది. ప్రభుత్వం అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయం అభివృద్ధి కోసం కాదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. ఏపీలో ఈ నెల 27న జరుగుతున్న భారత్ బంద్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని మంత్రి […]
వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ స్టైల్ మాత్రం మార్చుకోవడం లేదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. కేవలం 126 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది సన్‌రైజర్స్. ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓటమిపాలైంది. జేసన్ హోల్డర్ స్కోర్‌ను పరిగెట్టించినా… టీమ్‌ను గెలిపించలేకపోయాడు. లాస్ట్ బాల్‌కి 7 పరుగులు కావాల్సి ఉండగా…ఒక రన్ మాత్రమే వచ్చింది. దీంతో ఐదు […]
మేషం : ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ అవసరం. సంఘంలో మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపారంలో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. వృషభం : కొంతమంది మీ సహాయం పొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం వల్ల ఆందోళనకు గురవుతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. […]
తెలుగు రాష్ట్రాలకు వాన గండం ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొన్ని గంటల్లో తుఫానుగా మారబోతోంది. దీనికి గులాబ్ అని నామకరణం చేశారు. పశ్చిమ దిశగా పయనిస్తున్న ఈ తుఫాను ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం-గోపాల్‌పూర్‌ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను పలు రాష్ట్రాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాతోపాటు ఏపీ, తెలంగాణ, బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని […]
న్యూ ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్య నాథ్ దాస్ ను నియమిస్తూ… ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్య నాథ్ దాస్ సెప్టెంబర్ 30 న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని.. ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్ మంత్రి హోదాలో న్యూఢిల్లీ లోని ఏపీ భవన్ కేంద్రంగా ఆదిత్య నాథ్ దాస్ పని చేయనున్నారని… […]
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో ఎవరినీ నమ్మడం లేదా? అంటే అవుననే సంకేతాలే విన్పిస్తున్నాయి. టీడీపీ గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలవడం దగ్గరి నుంచి, పార్టీలోని సీనియర్లంతా వరుసబెట్టి బయటికి వెళుతుండటం చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇక తాజాగా ఆపార్టీకి చెందిన ఎన్నికల వ్యూహకర్తకు సైతం చంద్రబాబు గుడ్ బై చెప్పినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ చంద్రబాబు వ్యూహాలే ఆపార్టీకి శరణ్యంగా మారనున్నాయనే టాక్ ఆపార్టీలో విన్పిస్తోంది. ఇప్పటికే ఈమేరకు […]
వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుందనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ సైతం అలర్ట్ అవుతోంది. ఈమేరకు ఆపార్టీ తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమేననే సంకేతాలను తాజాగా పంపిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను ఆపార్టీ వినియోగించుకుంటోంది. ఓవైపు వైసీపీకి ఎంపీపీ పీఠాలు దక్కకుండా చెక్ పెడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగానే జనసేన పార్టీని టీడీపీ నేతలు లైన్లో పెడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర […]