సెప్టెంబర్ 25, శనివారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం:- ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది.
వృషభం:- విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కివచ్చే ఆస్కారం ఉంది. పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
మిధునం:- సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించే ఆస్కారం ఉంది. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. క్రీడా, కళా, రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు. వృత్తుల్లో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కర్కాటకం:- ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. విదేశీయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. మొండి బాకీలు వసూలు కాగలవు.
సింహం:- ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆందోళన తప్పదు. కొన్ని కారణాల రీత్యా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. విద్యార్థులలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.
కన్య:- హోటల్, తినుబండారు వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. అధైర్యం వదలి ధైర్యంతో ముందుకు సాగండి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళుకువ అవసరం.
తుల:- ఆర్థిక లావాదేవీలు అనుకూలం. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆడిటర్లకు చేజారిపోయిందన్న కేసులు మరల తిరిగి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల ఇంట శుభసందర్భాల్లో కీలకపాత్ర వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది.
వృశ్చికం:- ఉన్నతోద్యోగం లభించే అవకాశం ఉంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. రాజకీయ, కళారంగాల్లో వారు సన్మానాలు పొందుతారు. పాతరుణాలు తీసుస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. విద్యార్థినులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది.
ధనస్సు:- దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తుల్లో వారికి ఆశాజనకం. స్త్రీల పేరిట స్థిరాస్తులు అమరుతాయి. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావచ్చు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. రాబడికి మించిన ఖర్చులవుతాయి. విద్యార్థులకు టెక్నికల్, సైన్సు, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మకరం:- రాజకీయాలలో వారు తొందరపడి వాగ్దానాలు చేయకండి. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టండి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పెద్దలతో బాధ్యతారహింగా వ్యవహరించకండి. ప్రభుత్వ రంగాలలో వారికి మిత్రుల వల్ల సమస్యలు తలెత్తుతాయి.
కుంభం:- రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఉమ్మడి స్థిరాస్తి విక్రయించే విషయంలో సోదరులతో విభేదిస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాడు. సినిమా కళాకారులకు అభిమాన బృందాలు అధికమవుతారు. భాగస్వాముల మధ్య నూతన విషయాలు చర్చకు వస్తాయి.
మీనం:- వాణిజ్య ఒప్పందాలు వాయిదా వేయండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ ఆశయసిద్ధికి అవరోధాలు కలుగుతాయి. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!