అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోడీ. శుక్రవారం…ఆదేశ అధ్యక్షులు జోబైడెన్‌తో సమావేశమయ్యారు. కీలక విషయాలపై చర్చించారు. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి ఈ సమావేశం జరిగింది. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయని ఈ సందర్భంగా అన్నారు బైడెన్. ఇరుదేశాల సంబంధాల్లో టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుందన్నారు బైడెన్. వాణిజ్య రంగంలో పరస్పర సహకారం రెండు లాభదాయకమన్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో కొత్తశకం మొదలవుతోందని చెప్పారు. అమెరికాకు ప్రధాన మిత్రదేశాల్లో భారత్ కూడా ఒకటని స్పష్టం చేశారు.
ఇక ఇండియా-అమెరికా దేశాల మధ్య వాణిజ్య అంశాలు చాలా కీలకమన్నారు ప్రధాని మోడీ. ఈ దశాబ్దంలో ఇరు దేశాలు ఎంతో సహకరించుకున్నాయని చెప్పారు. వాణిజ్య అంశాలు మరింత బలపడడం చాలా అవసరమన్నారు.ఆ తర్వాత వైట్‌హౌస్‌లో క్వాడ్ దేశాల సదస్సు జరిగింది. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు పాల్గొన్నాయ్. కరోనా, వాతావరణం, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భద్రతపై కీలకంగా చర్చ జరిగింది. గతంలో సునామీపై కలిసికట్టుగా పనిచేసి, ప్రపంచానికి మద్ధతుగా నిలిచామన్నారు ప్రధాని మోడీ.
ఇప్పుడు కరోనాపై పోరాటం చేస్తున్నామని చెప్పారు.క్వాడ్ సమావేశం భారత్‌కు అత్యంత కీలకం. క్వాడ్ గ్రూపులో ఉన్న దేశాల్లో చైనాతో సరిహద్దును పంచుకుంటోన్న ఏకైక దేశం భారత్. ఈ సరిహద్దులోని చాలా ప్రాంతాలు వివాదాస్పదం అయ్యాయి. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనాను ఎదుర్కొనేందుకు, క్వాడ్‌లోని మిగతా మూడు సభ్య దేశాలతో కలిసి వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించేందుకు క్వాడ్ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తోంది భారత్.