అసెంబ్లీ సమావేశాలపై సీఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి సభ్యులు కోరినన్ని రోజులు శాసనసభ నిర్వహించాలని.. గతంలో కరోనా కారణంగా తక్కువ రోజులు, ప్రస్తుతం మహమ్మారి అదుపులో ఉండటంతో సభను ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.. ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయం ఉంచాలి…జీరో అవర్లో సభ్యులకు అవకాశం ఇవ్వాలని… ప్రభుత్వం తరఫున ఐటీ, ఇండస్ట్రీ, హరితహారం అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సీఎం […]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. GHMCలో కలిపేద్దామా..? మీ అభిప్రాయం చెప్పడంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడంపై చర్చ జరుగుతోంది. సికింద్రబాద్ కంటోన్మెంట్ ప్రాంతంపై తెలంగాణ ప్రభుత్వానికి అజమాయిషీ లేదు. దీంతో అక్కడ నివసించే సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా… ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే దానిని జీహెచ్‌ఎంసీలో కలపాలని స్థానికులు కోరుకుంటున్నారంటున్నారు మంత్రి KTR. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి KTR కామెంట్స్‌పై హర్షం వ్యక్తం […]
చాలా కాలం తర్వాత తెలంగాణ ఆర్టీసీకి కళ వచ్చింది. ఛైర్మన్, పూర్తిస్థాయి ఎండీ రాకే దానికి కారణం. కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కిస్తారని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బస్‌భవన్. దాని గురించే ప్రస్తుతం సంస్థలో పెద్ద టాక్ నడుస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బస్‌భవన్‌పై టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చ..! TSRTCలో దాదాపు మూడేళ్లపాటు ఇంచార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సారథ్యంలో పరిపాలన సాగింది. ఛైర్మన్ పదవి ఖాళీగా […]
ఏపీలో ప్రతిపక్ష రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వద్దనుకుని వదిలేసుకున్న పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు కలుపుతున్నాయి. చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నాయి. అవసరాలకు తగ్గట్టు పావులు కదుపుతున్నాయి. పక్క పార్టీ పొడే గిట్టని వాళ్లు ఈ పొత్తులకు ఎలా ఒప్పుకున్నారో…. బీజేపీని వదిలి టీడీపీ వెంట జనసేన పరుగులు? 2019 ఎన్నికలకు ముందు ఏపీలో.. టీడీపీ బీజేపీని వదిలేసింది.. జనసేన టీడీపీని వద్దనుకుంది. ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన పొత్తుపెట్టుకున్నాయి. ఇప్పటికీ అదేపొత్తు కొనసాగుతోంది. రాష్ట్రస్థాయిలో ఏదైనా విషయం వస్తే […]
భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి సెన్సెక్స్ 60 వేల మార్క్ దాటింది. అలాగే నిఫ్టీ 18 వేల పాయింట్లకు చేరువవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్ సెన్సెక్స్ 60 మార్కు దాటింది. మరోవైపు నిఫ్టీ సైతం 18000 కీలక మైలురాయి దిశగా పరుగులు తీస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలూ మార్కెట్ […]
బీజేపీ వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం మోదీ ఇమేజ్ వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గుజరాత్ కు వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. బీజేపీకి గుజరాత్ ను కంచుకోటగా మార్చేశారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న గుజరాత్ పై తన మార్క్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇక త్వరలోనే గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. […]
అమరావతి : దేశ రాజధాని ఢిల్లీకి సీఎం జగన్ మరోసారి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఢిల్లీకి వెళ్ళనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎల్లుండి వామపక్ష తీవ్రవాదం పై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో సమావేశం జరుగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న ఈ సమావేశం జరుగనుంది. ఇక ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యం లోనే రేపు ఢిల్లీ వెళ్లనున్నారు […]
సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. రైతు రుణ మాఫీ , రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీ క్రింద ఇవ్వాలిసిన 27 వేల 500 కోట్ల రూపాయల నిధులను డిమాండ్ […]
ఇండియాతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక మన ఇండియాలో జరిగే పెళ్లిళ్ల సీజన్‌లో పసిడికే డిమాండ్ ఎక్కువ. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 43,590 కి […]