అక్టోబరు నెలలో దేశంలోని బ్యాంకులకు.. 21 రోజుల పాటు సెలవులను భారత రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా 21 రోజుల పాటు వేర్వేరు రోజుల్లో సెలవులు ఇచ్చారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం అక్టోబరు నెలలో 14 రోజులపాటు సెలవులున్నాయి. దీంతో పాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి ఏడు వారాంతపు సెలవులున్నాయి. అక్టోబరు 1వతేదీన బ్యాంకుల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కాబట్టి… గ్యాంగ్ టక్ లో […]
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి విపక్ష పార్టీలు. దేశ వ్యాప్తంగా చేపట్టిన బందులో పాల్గొంటున్నాయి. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. భారత్ బంద్‌కు కాంగ్రెస్, జనసమితి, లెఫ్ట్ పార్టీలు ఒకే తాటి మీదకు వచ్చాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు..వ్యవసాయ చట్టాలపై గళం వినిపించనున్నాయి విపక్షాలు. జాతీయ రహదారులపై ధర్నాలకు సిద్దమయ్యాయి. తెలంగాణలో ఆర్టీసీ…విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. వీటికి నిరసనగా భారత్ బంద్‌లో పాల్గొంటున్నాయి […]
అసలే పార్టీ కష్టాల్లో ఉంది..నేతలంతా సపోర్ట్ గా ఉండాలి.. లోటు పాట్లు సర్దుకుపోవాలి..కానీ, ఇక్కడ జరుగుతున్నది రివర్స్..ఎటూ కఠిన చర్యలు తీసుకోలేరని అలుసుగా భావిస్తున్నారా? టీ కాంగ్రెస్ నేతల దూకుడుకు కారణాలేంటి? కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురం. అయితే…తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ రేవంత్ వచ్చిన తర్వాత… క్రమశిక్షణకి ప్రాధాన్యత అనే ఇండికేషన్ పంపించారు. దీంట్లో భాగంగానే… గాంధీ భవన్ లో పాస్ ల కోసం గొడవ పడ్డ ఇద్దరిలో ఒకరిని పార్టీ నుండి బయటకు […]
ఐపీఎల్‌లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. అబుదాది వేదికగా చెన్నై సూపర్ సింగ్స్‌తో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీ కొట్టనుండగా…రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్ గెలిచి ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువ అయ్యేందకు ప్రయత్నిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన కోల్‌కతా ఈ సారి ఎలగైనా గెలవాలనే పట్టదలతో ఉంది. ఇక ముంబై, బెంగుళూరు చెరో […]
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్థాన్.. ‘ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంద’ని భారత్ మండిపడింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్ వల్ల.. మొత్తం ప్రపంచం ఇబ్బందులు పడుతోందని భారత్ స్పష్టంచేసింది. తనవైపు ఇన్ని తప్పులు పెట్టుకొని అంతర్జాతీయ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ పదునైన వ్యాఖ్యలతో పాకిస్థాన్‌కు దిమ్మతిరిగిపోయే బదులిచ్చారు మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన స్నేహా ఐరాసలో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు అంశాన్ని లేవనెత్తారు. దీనిపై […]
ఏపి రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైందా ? రెండున్నరేళ్ల ముందే ఎన్నికల పొత్తుల మాట తెరపైకి వస్తోందా? మాజీ మంత్రి పితాని జనసేనపై చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి? జనసేనతో ప్రయాణంపై టిడిపిలో ఉన్న మాటే ఆయన చెప్పారా? ఈ చర్చ ఎటువెళుతోంది? దీనిపై బిజెపి ఏమంటోంది? ఏపి లో ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ, 2024 లో జరిగే ఎన్నికల్లో పొత్తుల చర్చలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. ఏపిలో ప్రస్తుతానికి […]
2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోదీ వేవ్ వీస్తే.. ఏపీలో వైఎస్ జగన్ వేవ్ వీచింది. అత్యధిక పార్లమెంట్ స్థానాలతో బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. సింగిల్ గానే ఆపార్టీ మెజార్టీ మార్క్ దాటడంతో సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మోదీ-షా ద్వయమే కేంద్రంలో హవా కొనసాగిస్తోంది. ఇక ఏపీలో వైసీపీ సరికొత్త రికార్డు సృష్టిస్తూ అధికారంలోకి వచ్చింది. 175 అసెంబ్లీ సీట్లకుగాను ఆపార్టీ ఏకంగా 151సీట్లను తన ఖాతాలో వేసుకొంది. […]
నెల్లూరు : రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ ను తిట్టడం పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాషన్ అయిపోయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని… ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమ లోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దల తో […]
మన సినిమాల్లో హీరోలు, విలన్లు ఎలాగైతే ఉంటారో.. పురాణాల్లోనూ దేవతలు, రాక్షసులు ఉండేవారు. వీరికి ఒకరంటే ఒకరు పడదు. ఎవరైనా మంచి పని చేస్తే ఇంకొకరికి అసలు నచ్చదు. దీంతో వీరి మధ్య నిత్యం ఫైట్ సీన్లు జరుగుతూనే ఉంటాయి. పురాణాల్లో అయితే దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధాలు జరిగినప్పుడు త్రిమూర్తులు(బ్రహ్మ, విష్ణు, శివుడు) ఏదోరకంగా సర్దిచెప్పేవారు. విన్నారా? ఒకే.. లేకుంటే తమ శక్తులతో అంతమొందించి లోకకల్యాణం చేసేవాళ్లు. మన సినిమాల్లోనూ అంతే. హీరో క్యారెక్టర్ […]
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ మరో లేఖ రాశారు. బీసీ బంధును అమలు చేయాలని… ముగ్గురు కాదు.. క్యాబినెట్ లో 8మంది బీసీలకు స్థానం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బీసీ కుంటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించాలని… జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు పథకం ప్రారంభించాలన్నారు. బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను విడాలని… టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో బీసీ సబ్ […]