హైదరాబాద్‌కు షాక్ : ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ స్టైల్ మాత్రం మార్చుకోవడం లేదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. కేవలం 126 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది సన్‌రైజర్స్. ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓటమిపాలైంది. జేసన్ హోల్డర్ స్కోర్‌ను పరిగెట్టించినా… టీమ్‌ను గెలిపించలేకపోయాడు. లాస్ట్ బాల్కి 7 పరుగులు కావాల్సి ఉండగా…ఒక రన్ మాత్రమే వచ్చింది. దీంతో ఐదు పరుగులు తేడాతో ఓడిపోయింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది.
Also Read
షమి వేసిన తొలి ఓవర్ మూడో బంతికి డేవిడ్ వార్నర్ కీపర్ కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. తర్వాత షమి వేసిన మూడో ఓవర్లో విలియమ్సన్ బౌల్డయ్యాడు. దీంతో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔటవడంతో జట్టు స్కోరు చాలా నెమ్మదిగా కదిలింది. ఇక హైదరాబాద్‌కు ఓటమి లాంఛనమే అనుకున్న తరుణంలో… జేసన్ హోల్డర్ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు. దీంతో 4 బంతుల్లో 10 పరుగులుగా మారింది. తర్వాత రెండు బంతులు పరుగులేమి రాలేదు. దీంతో లక్ష్యం రెండు బంతుల్లో పది పరుగులుగా మారింది. ఐదో బంతికి రెండు పరుగులే వచ్చాయి. ఫలితంగా సన్‌రైజర్స్ ఓటమిపాలైంది.
తాజావార్తలు
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
-
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
-
Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!