ఢిల్లీ పర్యటనలో రెండు రోజులుగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరిపారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే దొడ్డుబియ్యం కొనుగోలుపై కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. దొడ్డు బియ్యం కొనుగోలు అసాధ్యమని, ఇప్పటికే నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈసారికి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు భేటీ […]
తెలంగాణలో ప్రభుత్వం భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శించడం మొదలుపెట్టాయి. అంతేకాదు.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి వచ్చారు. అయితే, అసెంబ్లీ గేటు నుంచి లోనికి గుర్రపు బగ్గీని అనుమతించాలని పోలీసులకు కోరారు. దీనిక పోలీసులు అనుమతించలేదు. నేతలు వాగ్వాదానికి దిగడంతో కాంగ్రెస్ నేతలు భట్టి, శ్రీధర్‌బాబు, సీతక్క, జీవన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. భట్టిని రాంగోపాల్‌పేట పీఎస్‌కు తలించారు. గుర్రాలపై అసెంబ్లీ లోనికి వెళ్తామని పట్టుబట్టారు ఎమ్మెల్యేలు. దీంతో […]
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా షర్మిల రాజకీయ అరంగ్రేటం చేసింది. తన తండ్రిలాగే ఆమె కూడా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలను ఎంచుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లుగా సీఎంగా ఉండగా రెండుసార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య నవ్యాంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. ఈ క్రమంలోనే షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీకి కోసం పని చేశారు. […]
ఏపీ సిఎం జగన్ కు జనసేన నేత పోతిన వెంకట మహేష్ లేఖ రాశారు. 2020 దసరా ఉత్సవాల్లో అమ్మవారి ఆలయానికి తమరు హామీ ఇచ్చినట్టుగా 70 కోట్ల నిధులను తక్షణమే అమ్మవారి ఆలయానికి మళ్ళించాలని… ఇంతవరకు నిధులు రాలేదని ఈవో భ్రమరాంబ గారు లిఖితపూర్వకంగా తెలియజేశారని లేఖలో పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు స్టేట్ ఫెస్టివల్గా నిర్వహిస్తున్నారని.. 2019 & 2020 దసరా ఉత్సవాలకు సంబంధించిన నిధులను కూడా తమరు మంజూరు చేయలేదన్నారు. 2021 దసరా ఉత్సవాలు […]
న్యాయ వ్యవస్థలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళలకు ప్రాతినిథ్యమే లేకపోగా, రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల సంఖ్య నామమాత్రంగా ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారాయన. మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు సీజేఐ. ఆకాశంలో సగం… అవకాశాల్లోనూ మహిళలకు సగం వాటా ఇవ్వాల్సిందే అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. మన న్యాయ […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు 5 పేజీల బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. దళితులు సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అర్హులకు 10 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని… డిమాండ్ చేశారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని… కెసిఆర్ దళితులను నిట్టనిలువునా […]
గులాబ్ తుపాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ కారణంగా రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, […]
ఇవాళ రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు అధికార పార్టీ సిద్దమైంది. పూర్తిస్థాయి అజెండాతో సభ నడిపించడానికి స్పీకర్, అధికారులు కసరత్తు చేశారు. ఐటీ శాఖపై స్వల్పకాలిక చర్చతో ప్రభుత్వం చర్చను ప్రారంభించనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఇవాళ్టి నుంచి ఉదయం 10 గంటలకే మొదలవుతాయి. సభ మొదటి రోజు 11 గంటలకు ప్రారంభమైంది. అసెంబ్లీలో పూర్తిస్థాయి అజెండా అమలు కానుంది. మొదట ప్రశ్నోత్తరాలు..తర్వాత జీరో అవర్..బ్రేక్ తర్వాత…షార్ట్ డిస్కషన్- ఐటీ శాఖ..ఐటీ పురోభివృద్దిపై […]
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్..జగన్ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వైసీపీ మంత్రులు మరియు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. అయితే… పవన్ చేసిన వ్యాఖ్యలకు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు వైసీపీ మంత్రులు. కాగా… తాజాగా వైసీపీ సర్కార్ పై వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ […]
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 54 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు… 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. కోహ్లీ, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 18 ఓవర్లకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ హ్యాట్రిక్‌తోపాటు ఏకంగా 4 వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాశించాడు. హర్షల్‌కు తోడు స్పిన్నర్ చాహల్ 4 […]