విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసుల అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసే నిరసనల వల్ల ఘర్షణలు తలెత్తే అవకాశాలపై అప్రమత్తతగా ఉన్నారు. టీడీపీ నిరసనలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు ఉన్నాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
రాష్ట్రంలో ఘర్షణలు తలెత్తే అవకాశాలపై పోలీసుల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దసరా పండుగ సమయంలో ఇలాంటి నిరసనలపై ఇప్పటికే పలుచోట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దసరా పండుగ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని పోలీసులకు ఉన్నాతాధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Also: TDP-Janasena Meeting: నేడే టీడీపీ-జనసేన పార్టీల తొలి జేఏసీ సమావేశం
అయితే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ జగన్ కు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే, రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల మధ్యలో వీధుల్లోకి వచ్చి “సైకో పోవాలి“ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయండి. ఆ వీడియో, ఫోటోలను సోషల్మీడియాలో షేర్ చేయండి. సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా పండగని సెలబ్రేట్ చేసుకుందాం అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.