Anil Ambani: అనిల్ అంబానీ మెడకు ఈడీ ఉచ్చు బిగిస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి రూ.1,120 కోట్ల విలువైన ఆయన 18 ఆస్తులను జప్తు చేసింది. యెస్ బ్యాంక్ మోసం కేసులో ED తాత్కాలికంగా ఆయనకు చెందిన 18 ఆస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్‌లోని వాటాలను, అనిల్ అంబానీ గ్రూప్‌లోని రూ.1,120 కోట్ల విలువైన కోట్ చేయని పెట్టుబడులను జప్తు చేసింది.
READ ALSO: Akhanda 2: షాకింగ్.. 2026లో ‘అఖండ తాండవం’ రిలీజ్?
ఈడీ గతంలో అనిల్ అంబానీ చెందిన రూ.50 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCOM), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లకు సంబంధించిన బ్యాంకు మోసం కేసులు రూ.8,997 కోట్లు. అందువల్ల మొత్తం గ్రూప్ అటాచ్‌మెంట్ రూ.10,117 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL), రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (RIL), రిలయన్స్ పవర్ లిమిటెడ్ (RHFL) వంటి అనేక రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు నిధులను మోసపూరితంగా ఉపయోగించినట్లు ED గుర్తించింది.
అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దీనిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17 వేల కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో రిలయన్స్ గ్రూప్‌లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో, 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది.
READ ALSO: Temple wealth Belongs To Deity: దేవస్థానం సంపద దేవుడిదే: సుప్రీంకోర్టు