ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5: 25 నుంచి 6: 15 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాకతో రేపు హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజ్ భవన్, ఎల్బీస్టేడియం సభ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా ఉన్నతాధికారుల సూచనలతో ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ లను మూసివేయాలని (HMDA) నిర్ణయం తీసుకుంది.
ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలకు బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ కుల గనన వివరాలు బయటపెట్టే బయట పెట్టె దమ్ము ధైర్యం కాంగ్రెస్ బీజేపీ లకు ఉందా అని ఆమె ప్రశ్నించారు.
మాజీ హెచ్సీఏ అధ్యక్షులు అజారుద్దీన్ కు మల్కాజ్గిరి కోర్టులో ఊరట.. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన మల్కాజ్గిరి కోర్టు..
కాంగ్రెస్- బీఆర్ఎస్ రెండు ఒక్కటే.. నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి అని ప్రమోద్ పాండురంగ సావంత్ అన్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి పని చేశాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సి ఉంది.
ముషీరాబాద్ కు చెందిన నగేష్ ముదిరాజ్ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 2018లో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు.
సీపీఐ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదిరింది. కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మునుగోడులో స్నేహపూర్వక పోటీ కూడా ఉండొద్దని తేల్చి చెప్పింది.
దేవరకద్రలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదులు పారే ఈ జిల్లాను సర్వనాశం కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ తో పాటు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్టేజీ మీద డ్యాన్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు, యువకులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు.