Ram Charan : అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషన్స్‌తో దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ పక్కన ‘షాడో’లా కనిపిస్తున్న ఒక భారీ కటౌట్ గురించి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో, నెటిజన్లలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఆయనెవరో కాదు.. చరణ్ కొత్త పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కుంట. నల్లటి సూట్ ధరించి, పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో రామ్ చరణ్ ఎంబీపీ, భోపాల్, బెంగళూరు ప్రమోషన్స్ ఈవెంట్లలో కనిపించిన ఈ 27 ఏళ్ల బాడీగార్డ్ లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో కెవిన్ బ్యాక్‌గ్రౌండ్ గురించి వెతికిన నెటిజన్లకు కొన్ని మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలిశాయి.
కెవిన్ కేవలం ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు, ఆయన అంతర్జాతీయ స్థాయి ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. 2021లో ఇటలీ జాతీయ MMA టీమ్‌కు కూడా ప్రాతినిధ్యం వహించారు. కెవిన్ అసలు పేరు ‘అబ్దూ కదిర్ సోవ్’. 1998లో జన్మించిన ఈయన్ను గాంబియా రెజ్లింగ్ అసోసియేషన్ వారు ‘మామా లామిన్ ఆఫ్ బర్రా’ అని పిలుస్తారు. యూరప్ మిడిల్‌వెయిట్ డివిజన్లో ఫైట్ చేసే కెవిన్ ఖాతాలో 4 విజయాలు, 6 ఓటములు ఉన్నాయి (ఆయన చివరి ఫైట్ నవంబర్ 2025లో జరిగింది). తాజాగా జరిగిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో హోస్ట్ అమిత్ భాటియా.. కెవిన్‌కు వస్తున్న విపరీతమైన పాపులారిటీ గురించి రామ్ చరణ్‌ను అడగ్గా, చరణ్ తనదైన శైలిలో నవ్వుతూ చాలా ఫన్నీగా స్పందించారు.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
“మీరందరూ అతన్ని ఇంత ఫేమస్ చేసేశారు.. అందుకే ఇప్పుడు నేను అతన్ని అస్సలు బయట తిరగనివ్వట్లేదు. ఎవరైనా అతనికి ఒక చాక్లెట్ లేదా బిస్కెట్ ఇచ్చి నా పర్సనల్ విషయాలు చెప్పమని లంచం ఇస్తారేమోనని భయమేస్తోంది” అని చరణ్ హిందీలో సరదాగా వ్యాఖ్యానించారు. అదే ఇంటర్వ్యూలో ఉన్న సీనియర్ యాక్టర్ బోమన్ ఇరానీ.. “ఆ ట్రిక్ వర్కవుట్ అవుతుందా?” అని అనగా.. చరణ్ ఆఫ్-స్క్రీన్‌లో ఉన్న కెవిన్ వైపు చూపిస్తూ, “మిస్టర్ కెవిన్.. మేము ఎప్పుడు ఫ్యామిలీ, పిల్లలతో కలిసి బయటకు వెళ్లినా.. అతను గత నాలుగేళ్లుగా మా ఫ్యామిలీకి సెక్యూరిటీగా తోడుగా వస్తున్నాడు” అని క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!