రేపు విజయవాడలో టీడీపీ-జనసేన ఉమ్మడి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ముందు ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ - పీఏసీ భేటీ కానుంది. తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ- పీఏసీ భేటీలో చర్చించనున్నారు. ఇక, రేపటి జేఏసీ సమావేశానికి టీడీపీ- పీఏసీ అజెండా ఖరారు చేయనున్నారు.
టీడీపీ అధినేత, మజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక పంపిణీలో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది.
నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ బస్సు యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నారు. జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్దిని ప్రజల్లోకి వైసీపీ నాయకులు తీసుకెళ్తున్నారు. ఇక, నేడు ప్రకాశం జిల్లా కనిగిరిలో సామాజిక సాధికారిక యాత్ర కార్యక్రమం కొనసాగనుంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై రేపు ( గురువారం ) సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లారు. రేపేు కోర్ట్ నెంబర్ 6లో 11 వ నెంబర్గా చంద్రబాబు కేసు లిస్ట్ లో ఉంది.
పురందరేశ్వరి ఒక జగత్ కిలాడీ.. బావ కళ్లులో ఆనందం కోసం లేఖలు రాస్తోంది.. పురంధేశ్వరి లాంటి నీతి మాలినా, జగత్ కిలాడి లాంటి కూతురు ఎవరికి పుట్టకూడదని కోరుకుంటున్నాను.. పురంధేశ్వరి లాంటి కూతురు పుట్టిందని ఎన్టీఆర్ కుమిలి కుమిలి ఎడుస్తుంటారు అంటూ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని నారా లోకేష్ నేతృత్వంలోని టీడీపీ బృందం కలిసింది. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ నేతలు కోరారు.
ఏపీ సౌతిండియా బీహార్ గా మారుతోంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించాం.. ఆధారాల్లేకుండా రోజుల తరబడి జైళ్లల్లో ఉంచుతున్నారు.