విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండులో దుర్ఘటనతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ బస్సు యాక్సిడెంట్ పై నివేదిక సిద్ధమైంది. నివేదికపై అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు చర్చిస్తున్నారు.
చంద్రబాబు హాయంలో స్కీముల గురించి కాదు.. స్కాముల గురించే ఆలోచనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్.. ఫైబర్ స్కామ్, ఇసుక స్కామ్, అమరావతి భూముల స్కామ్ లు మాత్రమే జరిగాయని సీఎం జగన్ అన్నారు.
విశాఖపట్నంలో వైసీపీ సీనీయర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పెందుర్తి నియోజకవర్గంలో ఈ నెల 25 తేదీన విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన ఏపీలో వైఎస్సార్సీపీ గెలుపును ఎవరు ఆపలేరు అని ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏపీ గురించి మాట్లాడేటప్పుడు ముందు హైదరాబాద్ లో నాలాల్లో పిల్లలు కొట్టుకుపోతున్నారు అది చూడండి అని సెటైర్ వేశారు.
ర్తెతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మోసం చేసిన సీఎం జగన్ బటన్ నొక్కడం కూడా మోసగించడమేనంటూ ఆమె మండిపడ్డారు. నా మీద చేసే విమర్శలు డ్తెవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని పురంధేశ్వరి తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జిరాక్స్ రిజిస్ట్రేషన్ల విధానం అమల్లోకి రానుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలో ఈ విధానాన్ని స్టార్ట్ చేయగా.. నేటి నుంచి రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు.
కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలంలోని పాములలంకలో విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి చెందారు. పాములలంకకు చెందిన పాముల విజయాంభ, పాముల చిరింజీవిగా గుర్తించారు.
వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ దొరుకుతుంది. నేడు 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది.
వరుసగా ఐదో సంవత్సరం రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ ఆర్ధిక సహాయం ఇవాళ అందించనున్నారు. వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి 4,000 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు.