NCP Party: నేషనలిస్ట్ కాంగ్రెస్‌లో నాయకత్వ అంశంపై చాలా ఏళ్లుగా చర్చ కొనసాగుతుంది. ఎప్పుడూ మాట్లాడని ఎంపీ సుప్రియా సూలే.. ఈ అంశంపై తొలిసారిగా బహిరంగంగా వ్యాఖ్యానించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడానికి తనకే ఎక్కువ అర్హత ఉందని ఆమె అన్నారు. షిర్డీలో జరిగిన రెండు రోజుల నేషనలిస్ట్ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించారు. యశ్వంతరావు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే హక్కు నాకు మాత్రమే ఉంది.. యశ్వంతరావు చవాన్ ఆదర్శాలను అజిత్ పవార్ వర్గం పాటించడం లేదని సుప్రియా సూలే తెలిపారు.
Read Also: IND vs SA: టెస్టు అని ఎలా అనగలం?.. పిచ్ క్యురేటర్లపై స్టెయిన్ అసంతృప్తి!
ఇక, జాతీయవాదులలో సుప్రియా సూలే లేదా ఆమె ప్రాముఖ్యత పెరుగుతోందని ప్రఫుల్ పటేల్ ప్రకటన చేశారు. అతని వ్యాఖ్యలపై సుప్రియ సూలే స్పందిస్తూ.. ‘నేను బాగా చదువుకున్నాను, ఓ ప్రైవేట్ కంపెనీకి సీఈవో అయ్యాను.. రాజకీయ నేతగా అయ్యాక ఏం చేస్తాను? నేను లోక్‌సభలో ఒక్క టికెట్ మాత్రమే అడిగాను.. ఎందుకంటే రాజకీయ నాయకుల ద్వారానే మార్పు వస్తుందని నేను నమ్ముతాను అని సుప్రీయ సూలే వ్యాఖ్యనించారు.
Read Also: Purandeswari: ఎస్సీలకు సంబంధించి 27 కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది..
అయితే. అజిత్ పవార్ చేతిలో పార్టీ ఎలా నడుస్తుందని సుప్రియా సూలే ప్రశ్నించారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒత్తిడితో అతను కీలు బొమ్మగా మారిపోయాడు.. నేను నిజాయతీపరురాలుని కాబట్టి ఎవరికి భయపడేది లేదని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కాంట్రాక్టు నియామకాలను కూడా నిలిపివేస్తామని సుప్రీయ సూలే ప్రకటించారు..