Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
- వేడి నీరు, లిక్విడ్ సబ్బుతో సులభ పరిష్కారం
- బేకింగ్ సోడా–వెనిగర్ కాంబినేషన్‌తో మురికి మాయం
- ప్లంగర్, వైర్ ట్రిక్‌తో అడ్డంకులు తొలగింపు
- FSSAI సూచించిన పరిశుభ్రత చిట్కాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wash Basin Blocked : ఇంట్లో లేదా బాత్రూమ్లోని వాష్ బేసిన్ కొన్నిసార్లు అకస్మాత్తుగా అడ్డుపడుతుంటుంది. నీరు కిందకు ప్రవహించకుండా అలాగే నిలిచిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. సాధారణంగా బేసిన్ దగ్గర జుట్టు దువ్వడం, సబ్బు బిళ్ళల ముక్కలు లేదా వంటగది సింక్ అయితే ఆహార వ్యర్థాలు, పీచు పదార్థాలు పైపులో ఇరుక్కుపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రతిసారీ ప్లంబర్‌ను పిలవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ కొన్ని సులభమైన గృహ నివారణల (హోమ్ రెమెడీస్) ద్వారా ఈ చిన్నపాటి అడ్డంకులను మనమే సులభంగా తొలగించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. గోరువెచ్చని నీరు – డిష్‌వాషింగ్ లిక్విడ్
Also Read
- Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
- Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
- Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
- LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
ఈ పద్ధతి వాష్ బేసిన్‌తో పాటు వంటగది (కిచెన్) సింక్‌ను శుభ్రం చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. మొదటగా బేసిన్ డ్రెయిన్ రంధ్రం దగ్గర ఒకటి లేదా రెండు టీస్పూన్ల పాత్రలు కడిగే లిక్విడ్ సబ్బును వేయాలి. వెంటనే కొన్ని వేడి నీళ్లను నెమ్మదిగా అందులోకి పోయాలి. వేడి నీరు , సబ్బు కలవడం వల్ల పైపులో గట్టిగా అంటుకున్న మలినాలు, జిడ్డు వదులైపోయి నీరు సులభంగా కారిపోతుంది.
గమనిక: మీ వాష్ బేసిన్ పైపులు ప్లాస్టిక్‌వి అయితే, నీరు మరుగుతున్నంత వేడిగా కాకుండా కేవలం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
2. బేకింగ్ సోడా , వెనిగర్ మ్యాజిక్
పైపుల్లో పేరుకుపోయిన మురికిని, జిడ్డును తొలగించడానికి బేకింగ్ సోడా, వెనిగర్ కాంబినేషన్ ఒక సహజమైన , అత్యంత ప్రభావవంతమైన మార్గం. ముందుగా వాష్ బేసిన్ రంధ్రంలో కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి. ఆ వెంటనే దానిపై వెనిగర్ పోయాలి. ఈ రెండింటి కలయిక వల్ల అక్కడ రసాయన చర్య జరిగి నురుగు వస్తుంది. ఆ నురుగును దాదాపు 30 నిమిషాల నుండి గంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత రెండు లీటర్ల వేడినీళ్లను అందులో నెమ్మదిగా పోస్తే, పైపు లోపల ఉన్న మురికి పూర్తిగా కొట్టుకుపోతుంది.
3. ప్లంగర్‌తో ఒత్తిడిని పెంచడం
సింక్‌లో నీరు ఎక్కువగా నిలిచిపోయినప్పుడు ప్లంగర్ చక్కగా ఉపయోగపడుతుంది. ప్లంగర్‌తో బేసిన్ డ్రెయిన్ రంధ్రాన్ని పూర్తిగా మూసివేయాలి. ప్లంగర్ రబ్బరు కప్పు మునిగేలా బేసిన్లో కొద్దిగా నీరు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ప్లంగర్‌ను గట్టిగా కిందకు నొక్కుతూ, మళ్లీ బలంగా పైకి లాగాలి. ఇలా ఒక 5 నుండి 6 సార్లు చేయడం వల్ల లోపల ఒత్తిడి (ప్రెజర్) పెరిగి, అడ్డుపడిన చెత్త కదిలి నీరు ఫ్రీగా వెళ్తుంది.
4. వైర్ లేదా హ్యాంగర్ ట్రిక్
పైపులోపల జుట్టు వంటివి ఇరుక్కుపోయినప్పుడు మెటల్ బట్టల హ్యాంగర్ లేదా ఏదైనా వైర్‌ను నిటారుగా చేసి, దాని చివరను చిన్న కొక్కెం (హుక్) ఆకారంలో వంచాలి. ఈ హుక్ భాగాన్ని డ్రెయిన్ రంధ్రంలోకి మెల్లగా చొప్పించి గుండ్రంగా తిప్పాలి. దీనివల్ల లోపల ఇరుక్కుపోయిన వెంట్రుకలు లేదా పీచు పదార్థాలు ఆ కొక్కెనికి తట్టుకుని సులభంగా బయటకు వచ్చేస్తాయి.
FSSAI మార్గదర్శకాలు – బేసిన్ నిర్వహణ చిట్కాలు
ఆహార వ్యర్థాలు వేయొద్దు: తిన్న ప్లేట్లను కడిగే ముందు, వాటిలో మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను పూర్తిగా చెత్తబుట్టలో పారేయాలి. సింక్‌లలో ‘మెష్ స్ట్రైనర్లు’ (జల్లెడ లాంటి కవర్లు) వాడటం ద్వారా చెత్త పైపుల్లోకి వెళ్లకుండా ఆపవచ్చు.
రెగ్యులర్ క్లీనింగ్: వాష్ బేసిన్లో తరచుగా గోరువెచ్చని నీటిని పోస్తూ ఉండాలి. దీనివల్ల పైపులకు గ్రీజు లేదా జిడ్డు అంటుకోకుండా ఉంటుంది.
కలుషితం కాకుండా జాగ్రత్తలు: డ్రెయిన్ పైపులను శుభ్రం చేయడానికి ఉపయోగించే బ్రష్‌లు లేదా క్లీనింగ్ దుస్తులను (గుడ్డలను) ఆహారం తయారుచేసే ప్రదేశాలకు దూరంగా ఉంచాలి.
టచ్‌లెస్ బేసిన్లు: మరింత అధిక పరిశుభ్రత కోసం హ్యాండ్స్-ఫ్రీ (సెన్సార్ లేదా కాళ్లతో ఆపరేట్ చేసే) ట్యాపులను ఉపయోగించాలని FSSAI సిఫార్సు చేస్తోంది. దీనివల్ల మురికి చేతులతో ట్యాపులను తాకాల్సిన అవసరం ఉండదు కాబట్టి బ్యాక్టీరియా వ్యాపించకుండా ఉంటుంది.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!