జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్షలతోనే మా పార్టీ మ్యానిఫెస్టో రూపొందింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగున్నర ఏళ్ళల్లో మా ప్రభుత్వం ఏం చేసిందో అందరి.. కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా ప్రయోజనం పొందారు.
నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.. టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపటి నుండి ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆర్దికంగా ఏపీ బలోపేతం అవడానికి కారణం సీఎం జగన్.. జగన్ సీఎం కాకముందు తలసరి ఆదాయంలో ఏపి చాలా వెనుకబడి ఉంది.. వ్యవసాయ, పరిశ్రమ రంగంలో జగన్ హయాంలో ఏపీ చాలా ముందజలో ఉందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆందోళన చేస్తున్న కార్మికా సంఘాలకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ఎందరో పోరాటం చేశారు అని వ్యాఖ్యనించారు. నేను స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ కోసం న్యాయం పోరాటం చేస్తున్నాను..
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కార్మికా సంఘాల నాయకులను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిసి వారికి మద్దుతు ఇచ్చారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. పోరాటాల ద్వారా విశాఖ స్టీల్ ఫ్లాంట్ పరిశ్రమ సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు.
పార్వేటి మండపం వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అది ఒక వ్యక్తి చేసే ఆరోపణలు మాత్రమే.. మండపాలను తోసేసి అస్తవ్యస్తంగా చేసే ఆలోచన టీటీడీ ఎందుకు చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. శిధిలావస్థలో ఉన్న పార్వేటి మండపాన్ని అద్భుతంగా నిర్మించాం..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కల్తీ చాక్లెట్స్ తయారీ చేస్తున్న కేటుగాళ్లు గుట్టు బయట పడింది. హైదర్ గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు.
నేడు ఎన్నికల సంఘాన్ని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా టీడీపీ బృందం కలవనున్నారు. ఏపీలో ఓట్ల అవకతవకలపై ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లన్ని తొలగించారు అనే అంశంపై డేటాను ఎన్నికల అధికారికి టీడీపీ నేతలు ఇవ్వనున్నారు.
ఎన్నికల హామీల్లో ఉచితాలకు నేను వ్యతిరేకం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆర్ధిక పరిస్థితులు, భవిష్యత్ లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆర్ధిక వనరులు ఉంటాయా అని అంచనా వేయకుండా హామీలు ఇస్తుంటారు.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.