వందేమాతరం గీతం స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తినిచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్‌లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ చర్చ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ‘‘వందేమాతరం గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులకు ధన్యవాదాలు.. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్ల మందికి స్ఫూర్తి నింపిన వందేమాతర గీతంపై చర్చ జరపడం మనందరి అదృష్టం. ఈ చర్చ.. చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుంది.. ఈ మధ్యే మనం రాజ్యాంగ 75 ఏళ్ల సంబరాలు జరుపుకున్నాం.. 150 ఏళ్ల వందేమాతర గీతం ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లింది’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో ‘వందేమాతరం’పై 10 గంటలు చర్చకు కేటాయించబడింది. ప్రధాని మోడీ తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించనున్నారు. అనంతరం గౌరవ్ గొగోయ్, ప్రయాంకాగాంధీతో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రసంగించనున్నారు. ఇక రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభించనున్నారు.
వందేమాతం గీతాన్ని బంకిం చంద్ర ఛటర్జీ రాశారు. నవంబర్ 7, 1875లో బంగదర్శన్‌లో మొదటిసారిగా ప్రచురించబడింది. 1905లో బెంగాల్‌లో జరిగిన విభజన వ్యతిరేక ఆందోళన సమయంలో ఈ గీతాన్ని రాజకీయంగా ఉపయోగించారు. అనంతరం ఈ గీతం దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధులను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. ఇక ఈ గీతాన్ని జనవరి 24, 1950లో జాతీయ గీతంగా పరిగణించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ వార్షికోత్సవం నిర్వహించింది. ఏడాది పొడవునా వందేమాతరం వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
#WATCH | PM Narendra Modi says, "… Vande Mataram is a mantra, a slogan which gave energy, inspiration, and showed the path for sacrifice and penance to the freedom movement. It is a matter of pride that we are becoming witnesses to 150 years of Vande Mataram. It is a historic… pic.twitter.com/pHmsmS66uE
— ANI (@ANI) December 8, 2025