Kishan Reddy Fire on Chidambaram: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తున్నాడు.. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇయ్యలే.. కాంగ్రెస్ పార్టీని దంచి తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. 1969లో 365 మంది అమాయక విద్యార్థులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. మలిదశ ఉద్యమంలోనూ 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
4 కోట్ల మంది సకల జనులు ఆందోళన చేసి, కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారు అని కిషన్ రెడ్డి వెల్లడించారు. నాడు సుష్మాస్వరాజ్ నేతృత్వంలో బీజేపీకి సంబంధించిన 160 మంది ఎంపీలు పార్లమెంటు లోపల బయట తెలంగాణ ప్రజల గుండెచప్పుడై.. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు అని ఆయన చెప్పారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది.. ఉద్యమం విషయంలోనూ నియంతృత్వంగా వ్యవహరించింది.. దీంతో అనేక మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారు.. అటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు క్షమించరు అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.