సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్‌ను ఆపవద్దని పోలీసు ఉన్నతాధికారులను వెల్లడించారు. తన కోసం ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్‌ను తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
ధర్నా చౌక్ ని యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ధర్నా చౌక్ ని ఆయన పరిశీలించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ జిల్లాల అధ్యక్షులు, పార్టీ ఇంచార్జులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయన సీరియస్ అయ్యారు. పార్టీలో వ్యక్తి కేంద్రీకృతంగా పోస్టులు పెడితే వేటు తప్పదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖపై మంత్రి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై తీసుకుంటున్న విషయాలను గురించి ఆరా తీసిన మంత్రి..
తెలంగాణలోని ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. రెండో రోజు రిమ్స్ మెడికల్ కాలేజీ ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగుతుంది.
ఐపీఎస్ అధికారి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహేంద్ర సింగ్ ధోనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ధోనీ పిటిషన్ పై ఇవాళ విచారణ చేసిన హైకోర్టు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ కు 15 రోజుల జైలు శిక్ష విధించింది.
తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ఆయిల్ పామ్ సాగు రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపేందుకు అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ముంబై వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా మహిళా టీమ్ పట్టు బిగుస్తుంది. భారత అమ్మాయిలు తలో చేయి వేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు 138 పరుగులకే ఆలౌట్ చేసి 292 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం టీమిండియా పొందింది.
సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో అతిపెద్ద ఔట్ లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటోంది అని అన్నారు.