భారత్ లో ఇంగ్లండ్ మహిళల టీమ్ తో జరుగుతున్న ఏకైర టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మహిళా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించారు. తొలి రోజే ఆట ముగిసే సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 410 పరుగులు (94 ఓవర్లలో) చేసింది.
తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టి వారి రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఆ భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)కు చెందుతాయని ఇవాళ తీర్పు ఇచ్చింది.
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. టెస్ట్ సిరీస్ కోసం తాను దక్షిణాఫ్రికా వెళ్లేందుకు రెడీగా లేనట్లు వెల్లడించాడు. తన మోకాలి నొప్పి కోసం చికిత్స తీసుకుంటున్నాను.. కాస్త ఊరట లభించినా కచ్చితంగా టీమ్ తో కలుస్తానని వెల్లడించాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నియంతృత్వ ధోరణితో పాలన కొనసాగింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ లక్ష్యాలని నీరు కార్చారు.. కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారు.
నేనావత్ సూర్య నాయక్ లాక్ అప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేయాలి అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అన్న దమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణం అయ్యారు..
సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటాను.. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోం.. శాసన సభ భవనాలను సమర్థంగా వాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఇంద్రజిత్ పోరాడినప్పటికీ మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో తమిళనాడు లక్ష్య ఛేదనలో 230 రన్స్ కు ఆలౌటైంది. దీంతో 64 పరుగుల తేడాతో హర్యానా విజయం సాధించింది.