కరీంనగర్ బీజేపీ లో విభేదాలు ముదిరుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఉమ్మడి జిల్లా నేతలు నగరంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ కు పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నేతలు హాజరు అయ్యారు.
రాజ్యసభలో విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక బిల్లును ఆమోదించుకుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల సెలక్షన్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు కేంద్రమంత్రి ఉండనున్నారు.
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెప్తున్నాయని ఎంపీ సురేష్ తెలిపారు. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది?.. రాష్ట్ర సంపదను దోచుకున్నారు, అందువల్లే ప్రజలు పక్కన పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుపై టీడీపీ-జనసేన పార్టీలు చేసిన విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ- జనసేన పార్టీలు ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలి అని ఆయన చురకలంటించారు.
శ్రీశైల ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 21 ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరగింది. ఈ మీటింగ్ లో ట్రస్ట్ బోర్డ్ లో 30 ప్రతిపాదనలకు 28 ఆమోదం తెలపగా.. ఒకటి వాయిదా పడింది.. ఇంకో దాన్ని ట్రస్ట్ బోర్డు తిరస్కరించింది.
ఇప్పుడు మంగళగిరి ఎమ్మెల్యే.. గాజువాక ఇన్చార్జి కూడా వైసీపీకి రాజీనామా చేశారు.. ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉండరు అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో ఇటీవల తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న పంటలు, రంగు మారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై చర్చించారు.
విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అమరావతి రైతు పరిరక్షణ సమితి నేతలు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసింది. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థాయంలో అఫిడవిట్ దాఖలు చేసింది.