మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం ఇవాళ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. మంత్రి సుజిత్ బోస్‌కు సంబంధించిన ఇళ్లతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తపస్ రాయ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్‌కు సంబంధించిన ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ బలగాలు ఎదురుదాడికి దిగాయి. రెండు దేశాల సైన్యాలు హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే డజన్ల కొద్దీ స్థావరాలపై బాంబు దాడులు చేశాయి.
లోక్‌సభ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతుంది.‘భారత’ కూటమిలో చేరిన పార్టీల మధ్య సీట్ల పంపకాల కసరత్తు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ ఆమ్ ఆద్మీ- కాంగ్రెస్ మధ్య కీలక సమావేశం జరగనుంది.
తెలంగాణంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు సెలవులు స్టార్ట్ అయ్యాయి. ఈ నెల17 వరకూ సెలవులు కొనసాగుతాయని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు.. చెమట ధార పోశారు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటినీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడింది అని పేర్కొనింది.
మణిపూర్ నుంచి జనవరి 14న రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కానీ మణిపూర్ సర్కార్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ తో పాటు సభ్యుల రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.. అయితే, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్ లో రాజీనామాలు సమర్పించిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిన గవర్నర్.. దీంతో పాటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు.
రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.