భారత్తో వివాదం ముదిరిన తర్వాత మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. భారత్ లోనే వందలాది మంది తమ పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటు మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ మాల్దీవుల బుకింగ్లను రద్దు చేశాయి.
రష్యా నుంచి భీకర దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. సాయం కోసం భారత్కు విజ్ఞప్తి చేసింది. రష్యా దాడుల కారణంగా దేశం సర్వనాశనమైందని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఉక్రెయిన్ పేర్కొంది. ప్రపంచ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా పునర్నిర్మాణంలో ఉక్రెయిన్ ఇప్పుడు భారతదేశం నుంచి సహాయం కోరింది.
ఈసీ, సీఈసీ నియామకాలకు సంబంధించి కొత్త చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
భారత్- మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య పాత స్నేహానికి తెర పడుతుంది. మహ్మద్ ముయిజ్జూ అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్దీవుల్స్ ఆరు దశాబ్దాల వెనుకబడి పోయింది.
యెమెన్లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించిన స్థావరాలపై అమెరికా- బ్రిటన్ దళాలు బాంబులతో దాడి చేశాయి. ఈ దాడిలో హౌతీ రెబల్స్ కు సంబంధించిన పరికరాలు, వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ఆయుధాల నిల్వలు పూర్తిగా దెబ్బ తిన్నాయని అధికారులు సమాచారం అందించారు.
ఉత్తరప్రదేశ్ కనెక్టివిటీ కోసం కొత్తగా ఐదు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుందని పేర్కొన్నారు.
ఈ *401# నెంబర్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టెలికామ్ శాఖ ఓ హెచ్చరిక జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అలర్ట్ గా ఉండాలని చెప్పింది.